VIVEKAM BIOPIC TRAILER: వైఎస్‌ వివేకా బయోపిక్‌ ట్రైలర్‌ రిలీజ్‌.. ఇది చూస్తే ఆయన నిద్రపోతాడా..?

ఆర్జీవీ మూవీని వైసీపీ కార్యకర్తలు ప్రమోట్‌ చేస్తే.. రాజధాని ఫైల్స్‌ సినిమా మాత్రం జస్ట్‌ మౌత్‌ టాక్‌తోనే వైరల్‌ అయ్యింది. ఇప్పుడు అదే స్టైల్‌లో మరో సినిమా రాబోతోంది. వివేకం.. హూ కిల్డ్‌ బాబాయ్‌ పేరు మాజీ మంత్రి వైఎస్‌ వివేకా జీవితం ఆధారంగా ఈ సినిమా వస్తోంది.

  • Written By:
  • Publish Date - March 18, 2024 / 03:02 PM IST

VIVEKAM BIOPIC TRAILER: ఎన్నికల ప్రచారంలో ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు ఒకప్పుడు ప్రచారం మాత్రమే సాధనంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్‌ను నెమ్మదిగా సినిమాలు రీప్లేస్‌ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే పార్టీలకు మద్దతుగా సినిమాలు కూడా వస్తున్నాయి. రీసెంట్‌గా సీఎం జగన్‌కు మద్దతుగా రామ్‌ గోపాల్‌ వర్మ.. వ్యూహం, శపథం అనే సినిమాలు తీశాడు. ఆ రెండు కూడా వైసీపీ శ్రేణుల్లో మంచి హిట్‌ను సంపాదించుకున్నాయి. ఇదే టైంలో వైసీపీకి వ్యతిరేకంగా వచ్చిన రాజధాని ఫైల్స్‌.. సోషల్‌ మీడియాలో ఓ ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది.

mokshagna debut : ఎట్టకేలకు మోక్షజ్ఞకు డైరెక్టర్ దొరికాడు..

వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కున్న కష్టాలు, రాజధాని విషయంలో జరిగిన మార్పుల నేపథ్యంలో ఈ సినిమా తీశారు. ఆర్జీవీ మూవీని వైసీపీ కార్యకర్తలు ప్రమోట్‌ చేస్తే.. రాజధాని ఫైల్స్‌ సినిమా మాత్రం జస్ట్‌ మౌత్‌ టాక్‌తోనే వైరల్‌ అయ్యింది. ఇప్పుడు అదే స్టైల్‌లో మరో సినిమా రాబోతోంది. వివేకం.. హూ కిల్డ్‌ బాబాయ్‌ పేరు మాజీ మంత్రి వైఎస్‌ వివేకా జీవితం ఆధారంగా ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా కోసం పని చేసిన కాస్ట్‌ మొత్తం కొత్తవాళ్లే. వైఎస్‌ వివేకా రాజకీయ జీవితం, వైఎస్‌ చనిపోయిన తరువాత ఆ కుటుంబంలో వచ్చిన తగాదాలు, వివేకా హత్య, దస్తగిరి సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌.. ఇవే మెయిన్‌ లీడ్స్‌గా ఈ సినిమా వస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్‌ షోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అంతా కొత్త యాక్టర్స్‌ అవ్వడం. రియల్‌ పర్సన్స్‌ను మ్యాచ్‌ చేసేలా దగ్గరి పోలికలు ఉండటంతో ట్రైలర్‌ చాలా రియలిస్టిక్‌గా కనిపించింది. అంతా నిజం అని నమ్మే, బయటికి చెప్పలేని చాలా విషయాలను ఈ సినిమాలో రిలీవ్‌ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వివేకా అసలు హంతకులు ఎవరు, అధికారం కోసం.. పదవుల కోసం ఎవరెవరు ఎలాంటి పనులు చేశారు అనే విషయాలను ఈ సినిమాలో చాలా క్లియర్‌గా చూపెట్టినట్టు అర్థమవుతోంది.

ఈ సినిమా కోసం ప్రత్యకంగా వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ ఈ సినిమా ట్రైలర్‌ చూసి.. నచ్చినవాళ్లు సినిమాకోసం డొనేషన్ కూడా ఇవ్వొచ్చు. ఈ నెల 22న సినిమాను రిలీజ్‌ చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే వైఎస్‌ సునీత, షర్మిల ఒకవైపు చేరారు. వివేకా హంతకులకు జగన్‌ ఆశ్రయం ఇస్తున్నారు అనే ఆరోపణ వైసీపీని పట్టి పీడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో షర్మిల, సునీత ప్రధాన ఆయుధం వివేకా హత్యే అవుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో వివేకా బయోపిక్‌ రావడం.. అందులో నిజాలు చాలా పచ్చిగా ఉండటం చాలా మంది వ్యక్తులకు, పార్టీలకు నష్టం కలిగించే అంశం అవుతుందంటున్నారు విశ్లేషకులు.