Vyuham: వ్యూహం టీజర్‌లో ఇవి గమనించారా..?

తెలంగాణ ఉద్యమంతో పాటు.. జనసేన పార్టీ ఏర్పాటుకు ముందు చిరు, పవన్ మధ్య మీటింగ్, సోనియా గాంధీ పాత్ర.. హెలికాప్టర్ ప్రమాదం.. మన్మోహన్, రోశయ్య ఏం చేశారు.. ఇలా చాలా విషయాలు టీజర్‌లో చెప్పబోతున్నాడని క్లియర్‌గా అర్థం అయింది.

  • Written By:
  • Publish Date - August 15, 2023 / 02:11 PM IST

Vyuham: ఏపీ రాజకీయాల మీద వ్యూహాన్ని వదులుతున్నారు ఆర్జీవీ. ఆయన తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం వ్యూహం. రెండు పార్ట్స్‌గా వ్యూహం మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందులో తొలి భాగానికి వ్యూహం.. రెండో భాగానికి శపథం అనే టైటిల్ పెట్టారు. ఇప్పటికే వ్యూహం సినిమా టీజర్ విడుదలై ఏపీ రాజకీయాల్లో దుమారం రేపగా.. ఇప్పుడు మరో టీజర్‌ రిలీజ్‌ చేశాడు వర్మ.

తెలంగాణ ఉద్యమంతో పాటు.. జనసేన పార్టీ ఏర్పాటుకు ముందు చిరు, పవన్ మధ్య మీటింగ్, సోనియా గాంధీ పాత్ర.. హెలికాప్టర్ ప్రమాదం.. మన్మోహన్, రోశయ్య ఏం చేశారు.. ఇలా చాలా విషయాలు టీజర్‌లో చెప్పబోతున్నాడని క్లియర్‌గా అర్థం అయింది. ఒక్కో షాట్‌.. రెట్టింపు క్యూరియాసిటీ క్రియేట్‌ చేసింది. వైఎస్ మరణం తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయన్న విషయాలు ఆర్జీవీ చూపించే ప్రయత్నం చేశాడు అనిపిస్తోంది. జగన్, చంద్రబాబు, పవన్, చిరంజీవి, సోనియా, రోశయ్య, మన్మోహన్ సహా పలువురి పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. నిజం తన షూ లేస్ కట్టుకునే లోపే, అబద్దం ప్రపంచం అంతా ఓ రౌండ్ వేసి వస్తుంది అంటూ జగన్ పాత్రధారి చెప్పే డైలాగ్ హైలెట్ అయింది. టీజర్ చివరలో పవన్ మీద చంద్రబాబు వేసే సెటైర్‌ అందరినీ షాక్‌కి గురి చేసింది. ఏదో ఒకరోజు పవన్ కల్యాణ్‌ను కూడా వెన్నుపోటు పొడుస్తారు కదా అని అడిగితే.. వాడికి అంత సీన్ లేదు.. వాడిని వాడే వెన్నుపోటు పొడుచుకుంటాడనే డైలాగ్ సంచలనం కలిగిస్తోంది.

వ్యూహం ఫస్ట్ టీజర్‌లో జగన్ అరెస్ట్‌, కొత్త పార్టీ ఏర్పాటు సహా పలు అంశాలను చూపించారు ఆర్జీవీ. వైఎస్‌ హెలికాఫ్టర్ ప్రమాదంతో మొదలైన ఈ టీజర్‌లో.. ఆ తర్వాత సంఘటనలు చెప్పబోతున్నాడు. వ్యూహం మూవీని రామదూత క్రియేషన్స్‌ పతాకంపై ఆర్జీవీ తెరకెక్కిస్తున్నాడు. జగన్‌గా అజ్మల్‌, భారతిగా మానస నటిస్తున్నారు. చంద్రబాబు, పవన్, చిరంజీవి పాత్రలు అద్భుతంగా ఉన్నాయంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఎన్నికల ముందు రిలీజ్‌ కాబోతున్న ఈ మూవీ ఏపీ పాలిటిక్స్‌లో ఎలాంటి ప్రకంపనలు రేపుతుందో మరి!