ఏదేమైనా ఇప్పుడు డైరెక్టర్ లకు ఉన్న క్రేజ్ హీరోలకు కూడా లేదు. హీరో సినిమా కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ ఇప్పుడు డైరెక్టర్ ల సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. హీరో ఎవరు అనేది కాదు డైరెక్టర్ ఎవరు అనేది బాక్సాఫీస్ కు ముఖ్యం. ఒకప్పుడు వంద రోజులు ఆడే సినిమాలు చేసే డైరెక్టర్లకు, మాస్ సినిమాలు చేసే డైరెక్టర్లకు ఓ రేంజ్ లో ఇమేజ్ ఉండేది. కాని వాళ్ళ గురించి సినిమా విడుదల అయ్యే వరకు తెలిసేది కాదు పూర్తిగా. కాని ఇప్పుడు సినిమా ప్రకటన వచ్చిన దగ్గరి నుంచి స్టార్ డైరెక్టర్ ల గురించి పెద్ద చర్చే నడుస్తోంది.
బాహుబలి సినిమాతో జక్కన్న రేంజ్ బాలీవుడ్ లో కూడా పెరిగింది. అంతక ముందే జక్కన్నకు ఓ ఇమేజ్ ఉండేది. ఇక కేజిఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ ఇమేజ్ బాగా పెరిగింది. ఇక యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగాకు హీరో ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు దేవరతో కొరటాల శివకు మంచి ఇమేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇలా డైరెక్టర్లకు హీరో ఇమేజ్ రావడం చూసి హీరోలు కూడా షాక్ అవుతున్నారు. వీళ్ళు కేవలం మన తెలుగులోనే. తమిళంలో ఈ లిస్టు పెద్దదే.
అందుకే ఇప్పుడు హీరోలు తమ కెరీర్ స్పీడ్ అందుకోవాలి అంటే స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయాలని పోటీ పడుతున్నాడు. స్టార్ డైరెక్టర్ల కథల కోసం చాలా మంది స్టార్ హీరోలు ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు కథ రాసుకుని హీరో కోసం ఎదురు చూసేవాళ్ళు డైరెక్టర్లు. కాని ఇప్పుడు డైరెక్టర్ కోసం హీరోలు ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ కోసం అటు కన్నడలో యష్ ఎదురు చూస్తున్నాడు, ఇక్కడ ప్రభాస్ కూడా చూసే పరిస్థితి ఉంది. ఇక ఎన్టీఆర్ తో ఇప్పుడు ప్రశాంత్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సలార్ 2 మొదలవుతుంది.
యానిమల్ సినిమా తర్వాత స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి వంగా వర్క్ చేయడం మొదలుపెట్టాడు. తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలి. ఇక సందీప్ కోసం అల్లు అర్జున్ కూడా ఎదురు చూడటం మొదలుపెట్టాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇప్పుడు బన్నీ… సందీప్ తో సినిమా చేయాల్సి ఉంది. ఇక రాజమౌళి కోసం మహేష్ బాబు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికి వాళ్ళ సినిమా ఫైనల్ అయింది. షూటింగ్ కూడా మొదలుపెట్టారు. అటు సందీప్ రెడ్డి వంగా కోసం, ప్రశాంత్ నీల్ కోసం రామ్ చరణ్ ఎదురు చూస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇలా డైరెక్టర్ల మేనియా నడుస్తోంది టాలీవుడ్ లో. తమిళంలో వెట్రిమారన్, లోకేష్ కనగారాజ్ కోసం కూడా హీరోలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.