అర్జుణుడిని గైడ్ చేసే క్రుష్ణుడే కురుక్షేత్రంలో కత్తి పట్టుకోవాల్సి వస్తే.. ప్లూటు పట్టుునే చేయి ఆ కత్తిని మళ్లీ ఫ్లూట్ గా మారుస్తుంది.. ఈ కాన్సెప్ట్ తో వార్ 2 రాబోతోందట. అంటే వార్ 2 లో హ్రితిక్ అర్జునుడిగా, తారక్ కృష్ణుడిగా కనిపించబోతున్నాడట. అంటే నెమలి పించం ధరించేలా కాదు, కేవలం ఆపాత్రల ప్రేరణగా కథ డిసైన్ అయ్యిందట.
వార్ 2 లో హ్రితిక్ రోషన్ కి గురువుగా తారక్ వేసే పాత్ర ఉండబోతోంది. అది కూడా కేవలం 20 నిమిషాలే ఆ పాత్ర ఉంటుందట. ఓరకంగా హిందీ వార్ 2 మూవీ లో తారక్ ది అతిధి పాత్రని తెలుస్తోంది. మొత్తానికి ప్రభాస్ వదులుకున్న పాత్రలో తారక్ మెరవటం ఖాయమైంది.