ఈ సినిమా తరువాత ప్రశాంత్‌నీల్ డైరెక్షన్లో జనవరిలో మరో సినిమా స్టార్ట్ అవ్వనుంది. ఆ సినిమాతో పాటు వార్-2 సినిమా షూటింగ్ కూడా జరగనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నాడు. బ్రహ్మాస్త్ర సినిమా హిట్‌తో మంచి జోష్‌లో ఉన్న అయాన్ ముఖర్జీ.. బ్రహ్మాస్త్ర పార్ట్ -2, పార్ట్-3లను 2026, 2027లో రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నాడు. వీటి మధ్యలో వార్-2 సినిమాను కూడా డైరెక్ట్ చేస్తానని ఎనౌన్స్ చేశాడు.
2019లో వచ్చి వార్ సినిమా డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్.. ప్రస్తుతం ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో మరో సినిమా ప్లాన్ చేశాడు. దీంతో వార్-2 డెరెక్షన్ బాధ్యత అయాన్ ముఖర్జీ తీసుకున్నాడు. యష్‌రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా ఈ సినిమాతో సౌత్ మార్కెట్‌ను ఎట్రాక్ట్ చేసే పనిలో ఉన్నాడు. పాన్ ఇండియా లెవెల్లో తమ సిరీస్‌ను నెంబర్ వన్ ప్లేస్‌లో ఉంచాలనే టార్గెట్‌తో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే వార్-2లో ఎన్టీఆర్‌ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.
యష్‌రాజ్ ఫిలిమ్స్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌లో కూడా సౌత్ నుంచి చాలా మంది యాక్టర్స్‌ను తీసుకోనున్నట్టు సమాచారం. ట్రిపులార్ సినిమాతో ఎన్టీఆర్ తెచ్చుకున్న క్రేజ్ వార్-2ను సినిమాకు ఓవర్సీస్లో ప్లస్ అయ్యే చాన్స్ ఉంది. ఎన్టీఆర్ కెరీర్‌కు కూడా వార్-2 సినిమా చాలా ప్లస్ అవుతుందంటున్నారు క్రిటిక్స్. తెలుగు ఫిలిం ఇడస్ట్రీకి కూడా ఇదొక బిగ్‌లీప్ అంటున్నారు. ఈ న్యూస్ అఫీషియల్ అని తెలియగానే తారక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ ఫేవరెట్ హీరోను వార్ లాంటి యాక్షన్ సీక్వెన్స్‌లో చూసేందుకు వెయిట్ చేస్తున్నారు.