నిజంగానే వరంగల్ లో షూటింగ్ చేసిన సినిమాలు, అక్కడ ప్రీరిలీజ్ ఈవెంట్లు చేసిన మూవీల అన్నీ హిట్టయ్యాయా? నిజంగా ఇండస్ట్రీ జనానికి వరంగల్ ఓ పెద్ద సెంటిమెంట్ అయ్యిందా? అంటే అందులో చాలా వరకు నిజం కూడా ఉంది. అలాని మొత్తం నిజం అనుకునే పరిస్థితి లేదు.
వర్షం షూటింగ్ తర్వాత ఆడియో ఫంక్షన్ అక్కడే చేశారు. అది బ్లాక్ బస్టర్ అయినప్పటి నుంచి ఈ సెంటిమెంట్ మొదలైంది. అక్కడే కొన్ని చోట్ల తీసిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఎమ్ సీఏ హిట్టయ్యాయి. ఇష్మార్ట్ శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ అక్కడే జరిగింది. అలా కలిసొస్తోంది కాబట్టే అంతా అక్కడే షూటింగ్స్ లేదంటే, ఈవెంట్లు చేసుకోవచ్చు కా అంటే, అది పనిలో భాగంగా కలిసి రావాలంటున్నారు. ఐతే రాణిరుద్రమా దేవి, లైగర్, సైనికుడు లాంటి మూవీల్లో కొన్ని అక్కడే తీశారు, కొన్ని అక్కడే ఈవెంట్లు చేశారు. కాని కలిసి రాలేదు. కాబట్టి వరంగల్లో సినిమా తీస్తేనో, ఈవెంట్ చేస్తోనే హిట్లొస్తాయనలేం. కాని అక్కడ తీసిన, ఈవెంట్లు చేసిన సినిమాల్లో 70 శాతం హిట్లున్నాయి కాబట్టి, అదో సెంటిమెంట్ గా మారినట్టుందనే వాదన కూడా ఉంది.