హనుమాన్ సినిమాతో యంగ్ హీరో తేజా సజ్జా ఇండియా వైడ్ గా ఫేమస్ అయ్యాడు. ఫస్ట్ సినిమాతోనే పాన్ ఇండియా హిట్ కొట్టిన ఈ యంగ్ సీనియర్ యాక్టర్ ఇప్పుడు తర్వాతి ప్రాజెక్ట్ లపై వర్క్ చేస్తున్నాడు. హనుమాన్ సినిమా ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ కావడంతో బాలీవుడ్ హీరోల దృష్టిలో కూడా పడ్డాడు ఈ కుర్ర హీరో. ఇప్పుడు స్టార్ హీరోలు… బాలీవుడ్ ను డామినేట్ చేయడానికి నానా కష్టాలు పడుతుంటే తేజా సజ్జా మాత్రం ఒక్క సినిమాతో బాలీవుడ్ హీరోల రికార్డులను కూడా బ్రేక్ చేసాడు.
ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఈ యంగ్ సెన్సేషన్ హాట్ టాపిక్ అవుతున్నాడు. రానాతో కలిసి పాల్గొన్న ఓ ఈవెంట్ లో హోస్ట్ గా చేసిన తేజా సజ్జా… అక్కడ చేసిన కామెంట్స్ పై మహేష్ బాబు ఫ్యాన్స్, రవితేజా ఫ్యాన్స్ ఫైర్ మీదున్నారు. అలా సోషల్ మీడియాలో వివాదాలకు కూడా ఇప్పుడు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ కుర్ర హీరోను నెత్తిన పెట్టుకున్నారు. మెగా ఫ్యామిలీలో ఓ హీరోగా చూస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి వర్క్ చేసాడు తేజా.
ఇప్పుడు హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవ కూడా తేజాపై ప్రసంశలు కురిపించారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రసంశలు కూడా అందుకున్నాడు ఈ యంగ్ హీరో. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఈ ఏడాది ముగుస్తుండటంతో నేను అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ మీతో షేర్ చేసుకుంటున్న అని రణవీర్ సింగ్ ప్రసంశాలను బయటపెట్టాడు. నిజానికి ఈ కాంప్లిమెంట్ నాకు ఎంతో పర్సనల్ ఎంతో కాలం నుండి ఇది నా దగ్గరే దాచుకున్న అని సీక్రెట్ ను బయటపెట్టాడు.
ఇప్పుడు దాని బయట పెట్టడానికి ఆగలేకపోతున్నా… నేను రణవీర్ నుండి బెస్ట్ కాంప్లిమెంట్ అందుకున్న. ఆయన నా వర్క్ గురించి మాట్లాడిన తీరు, ప్రేమగా నాతో మాట్లాడుతూ.. చిన్న చిన్న విషయాలను సైతం ఆయన బ్రేక్ డౌన్ చేస్తూ వివరించారు అని సంతోషంతో పొంగిపోయాడు. ఇది జస్ట్ కాంప్లిమెంట్ కాదు స్వచ్ఛమైన ప్రోత్సాహం, నేరుగా హృదయం నుండి వచ్చిందన్నాడు తేజా. దయ, ప్రేమలకు ఆయన ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పుకొచ్చాడు. నా ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చినందుకు ధన్యవాదాలు భాయ్ Much love always! అని తన ఎక్స్ లో పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రణవీర్ సింగ్… ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చేయాల్సి ఉండగా అది ప్రభాస్ తో హోంబలే బ్యానర్ లో చేస్తున్నారు.