దేవర సినిమా దుమ్ము రేపుతోంది. కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా అన్నట్టు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా దేవర జాతర మాత్రం ఆగలేదు. టికెట్ లు తెగుతూనే ఉన్నాయి, సినిమా వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి. దేవర ఇప్పుడు 800 కోట్ల దిశగా వెళ్తోంది అనే టాక్ వస్తోంది. దేవర సినిమా బాగున్నా జనాలు మాత్రం సినిమాలు అసలు బాగా లేదని ప్రచారం చేసారు. అయినా దేవర భారీ వసూళ్ళ దిశగా అడుగులు వేస్తోంది. ఇక ఈ సినిమా రెండో పార్ట్ పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ సారి కొరటాల కథ విషయంలో పక్కా లెక్కతో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ రేంజ్ ను పెంచే విధంగా దేవర 2 కథ ఉంటుందని సిని వర్గాలు అంటున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా షూట్ మొదలయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దేవర సినిమా వసూళ్లు 800 కోట్లు దాటినా దగ్గరలో ఉన్నా సరే ఎన్టీఆర్ రేంజ్ పెరిగినట్టే. ప్రభాస్ మాదిరిగా ఎన్టీఆర్ కు ఇమేజ్ లేదు. ప్రభాస్ కు విదేశాల్లో కూడా భారీగా మార్కెట్ ఉంది. హిందీలో కూడా ప్రభాస్ మార్కెట్ కు ఇబ్బంది లేదు.
అందుకే కల్కీ 1200 కోట్లు సాధించింది. ఇప్పుడు దేవర సినిమా గనుక 800 కోట్లు వసూలు చేసినట్లు అయితే మాత్రం కచ్చితంగా ఎన్టీఆర్ నీల్ సినిమా టార్గెట్ 1200 కోట్లు పైనే ఉంటుంది. అందుకే ఎన్టీఆర్ కూడా ఇప్పుడు ఇతర భాషల మీద ఫోకస్ ఎక్కువ పెడుతున్నాడు. వార్ 2 సినిమాను ఎక్కువగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వార్ 2 లో ఎన్టీఆర్ పాత్ర నెగటివ్ గా ఉన్నా సరే ఎన్టీఆర్ మాత్రం తన ఇమేజ్ డ్యామేజ్ కాకుండానే ప్లాన్ చేసుకున్నాడు. అక్కడ ఎన్టీఆర్ పాత్ర హిట్ అయితే అక్కడ భారీ మార్కెట్ పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. మరి ఏం చేస్తారో చూడాలి.