మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తో 1200 కోట్ల వసూళ్లని అచీవ్ చేశాడు.మల్టీస్టారర్ హిట్ తర్వాత దేవరతో సోలోగా పాన్ ఇండియాని ఏలాడు.. ఆల్రెండీ 1200 కోట్లు, 510 కోట్లు ఇలా రెండు సార్లు సాలిడ్ వసూళ్ల వరదని చూశాడు. ఆల్ మోస్ట్ వెయ్యికోట్ల కటౌట్ గా పాన్ ఇండియా మార్కెట్ లోదూసుకుపోతున్నాడు. అయినా ఏదో వెలితి… కోలీవుడ్, మళ్లూవుడ్.. ఈరెండీంటిని కబ్జాచేసేందుకు మాత్రం గట్టిగానే ఏదో ప్లాన్ చేస్తున్నాడు. మాస్ మూవీలను మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలను కావాలని లైట్ తీసుకుంటుంది అరవ జనం.. అయినా తమిళ మార్కెట్ ని వదిలేదు లేదంటున్నాడు ఎన్టీఆర్. కంటెంట్ డ్రివెన్ స్టోరీలకే ఫిదా అయ్యే మళ్లూ వుడ్ మార్కెట్ మొత్తం కలిపినా 100 కోట్లు మించదు..మొత్తంగా తమిళ్, మలయాళ మార్కెట్ కలిపినా ఓ హిట్ మూవీకి అక్కడని నుంచి 200 కోట్ల నుంచి 300 కోట్లొస్తే గొప్ప.. అలాంటిది 1000 కోట్ల కటౌట్ గా మారాక కూడా ఆరెండీంటి మీద ఎందుకు ఎన్టీఆర్ అంతగా ఫోకస్ చేశాడు..?
కోట్లు కొల్లగొట్టే సామర్ధ్యం సొంతమైనప్పుడు లక్షలు లెక్కలోకి రావు.. కాని లక్షలే లేంది కోట్లెలా లెక్కేస్తామన్న పాయింట్ పట్టుకున్నాడు ఎన్టీఆర్. తనకి 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు వసూళ్లు రాబట్టే పాన్ ఇండియా మార్కెట్ సొంతమైంది. రెండు పాన్ ఇండియా హిట్లతో తనేంటో ప్రూవ్ అయ్యింది. త్రిబుల్ ఆర్ 1200 కోట్లు మించితే, దేవర 510 కోట్ల షేర్ వసూల్లతో హిస్టరీ క్రియేట్ చేసింది
ఇది చాలుకదా అనుకుంటున్న టైంలో సౌత్ లో రెండు నార్త్ లో ఒక మార్కెట్ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ చేశాడు ఎన్టీఆర్ . అదే తమిళ, మలయాళ, పంజాబీ మార్కెట్లు… మాస్ లో భయంకరమైన ఫాలోయింగ్ ఉంది కాబట్టి, నార్త్ లో మాస్ ఆడియన్స్ ఎన్టీఆర్ కి ఫిదా అయ్యారని దేవరతో తేలింది కాబట్టి, పంజాబీ మార్కెట్ ని కొల్లగొట్టడం తారక్ కి పెద్ద కష్మమేమి కాదు.
ఎటొచ్చి తమిల, మలయాళ మార్కెట్లే అంతుచిక్కట్లేదు. పంజాబీ మార్కెట్ మన దేశంలో చిన్నదే అయినా, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ లో సెటిలైన సిక్స్ పర్సెంటేజ్ ఎక్కువ. వాళ్లవల్ల ఓవర్ సీస్ లో 400 నుంచి 500 కోట్ల వరకు వసూళ్లు బోనస్ గా సొంతమయ్యే చాన్స్ ఉంది. కాబట్టే వార్ 2 లో విలన్ రోల్ వేసి మరీ, బాలీవుడ్ రూట్లో పంజాబీ మార్కెట్ ని కొల్లగొట్టాలనుకుంటున్నాడు.
అంతవరకు బానే ఉంది. పంజాబీ మార్కెట్ పెద్దది కాబట్టి, వార్ 2 చేస్తున్నాడనుకోవచ్చు.. కాని డ్రాగన్ ని, దేవరని తెలుగుతో పాటు, తమిళ, మలయాళంలో ట్రైలింగువల్ మూవీగా ఎందుకు ప్లాన్ చేస్తున్నాడు. దేవర తెలుగు, హిందీలో ఒకేసారి తెరకెక్కించారు. వర్కవుట్ అయ్యింది. కాని తమిళ్, మయాళం లో స్ట్రేయిట్ గా సినిమాను తెరకెక్కించాలంటే, ఒకే సారి డ్రాగన్ ని, దేవరని నాలుగు భాషల్లో తెరకెక్కించాలి. అంటే ఒకేసారి తారక్ నాలుగు సినిమాలు చేసిన దాంతో సమానం.
ఇంత చేస్తే వచ్చేలాభం ఏంటో చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎందుకంటే మలయాళ మార్కెట్ తిప్పి తిప్ప కొడితే 100 కోట్లు రావటం ఎక్కువ. అది కూడా పూనకాలు తెప్పించే రేంజ్ లో ఉండే మూవీలొస్తే ఏ రెండు మూడేళ్ల కోసారి ఇలాంటి వసూళ్లొస్తాయి. లేదంటే 50 కోట్ల వసూళ్లే మళయాల మార్కెట్ స్టామినా..
ఇక తమిళ్ మార్కెట్ తెలుగులో పోలిస్తే చిన్నదే.. అక్కడ రజినీ, విజయ్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయితేనే 150 కోట్లొస్తే ఎక్కువ… ఇక యూఎస్, యూకే లో సెటిలైన తమిల భారతీయుల వల్ల, మరో 50 నుంచి 100 కోట్లు ఎక్ట్స్ రా యాడ్ అవుతాయి. సో తమిల్, మలయాళం రెండు మార్కెట్లు కలిపినా 100 నుంచి 300 కోట్లే వస్తాయి… అలాంటి మార్కెట్ కోసం 1000 కోట్ల స్టామినా ఉన్న తారక్ బై లింగువల్ కాదు, ట్రైలింగువల్ కాదు, నాలుగు భాషల్లో సినిమాలు తీయటం అవసరమా అన్న చర్చ మొదలైంది.. అక్కడే ఎన్టీఆర్ ప్రపంచ ముదురనిపించుకుంటున్నాడు.
తమిళ ఆడియన్స్, బేసిగ్గా తెలుగు, మలయాళ కన్నడ హిందీ ఇలా ఏ భాషకు చెందిన హీరోలను ఆదరించే అవకాశం తక్కువ. మరెందుకు ఎన్టీఆర్ అరవోళ్ల కోసం అంత తాపత్రేయ పడుతున్నాడంటే, దివంగత నేత జయలలిత, ఎమ్ జీ ఆర్ లు తమిళులు కాదు.. రజనీ మారాఠీ అయినా వాళ్లని నెత్తి మీద పెట్టుకున్నారు. కారణం తమిళ్ లో సినిమాలు తీశారు కాబట్టి. సో తమిల్ లోనే మూవీ తీస్తే అక్కడ తనకి మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది. 100 నుంచి 300 కోట్ల మార్కెట్ స్టామినానే ఉన్నా, అదేం తక్కువ ఎమౌంట్ కాదు కాబట్టి, ఛాన్స్ తీసుకోవద్దనే, ఎన్టీఆర్ ఇలా మార్కెట్ పెంచుకునేందుకు రిస్క్ ని కూడా పెంచేస్తున్నాడు.