పుష్ప2 ఈవెంట్‌లో నిర్మాతపై దేవీశ్రీ ప్రసాద్ రుసరుసలు హాట్ టాపిక్‌గా మారింది.పుష్ప2 రీ రికార్డింగ్‌ను మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్‌తో చేయించడంతో దేవీశ్రీ హర్ట్ అయ్యాడా? Dsp ఇగో దెబ్బతిందా? దీంతో నిర్మాతను టార్గెట్ చేశాడా? లేదంటే… బన్నీ.. సుకుమార్‌ను అనలేక ఆ కోపాన్ని ప్రొడ్యూసర్‌పై తీర్చుకున్నాడా? మొత్తానికి ఈ కాంట్రవర్సీ… సినిమా బ్యాక్‌గ్రౌండ్ కంటే.. రీ సౌండ్‌గా వినిపిస్తోంది. అసలేం జరిగిందో చూద్దాం.
పుష్ప2లోని ఐటంసాంగ్ ‘కిసక్’… ఊ అంటావా మావను మించుతుందా? అని అందరూ ఎదురుచూస్తుంటే.. దేవీశ్రీ వ్యాఖ్యలతో ఐటంసాంగ్‌ను మర్చిపోయారు. దేవీశ్రీ ఎందుకిలా అన్నాడంటూ ఆరాలు తీయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. దేవీశ్రీ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ నచ్చకపోవడంతో తమన్, కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్.. క ఫేం జేమ్స్ సి రంగంలోకి దిగారని.. దేవీశ్రీతోపాటు బ్యాక్‌గ్రౌండ్‌ను పంచుకున్నారంటూ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. డాకు మహారాజ్ టీజర్ రిలీజ్ టైంలో పుష్ప2 బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక పార్ట్ అయ్యానని.. మరికొందరు వర్క్ చేస్తున్నారని చెప్పడంతో పుష్ప2 ఆర్‌ఆర్ పై క్లారిటీ వచ్చేసింది.
పుష్ప2 బ్యాక్‌గ్రౌండ్ కోసం తనని కాదని మరో ముగ్గురిని తీసుకురావడంపై దేవీశ్రీ బాగా హర్ట్ అయ్యాడు. పుష్పతో ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా జాతీయ అవార్డు అందుకున్న దేవీశ్రీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. దీంతో ఆ కోపం.. కసిని దాచుకోలేక..పుష్ప2 స్టేజ్ మీద నిర్మాతపై డైరెక్ట్ ఎటాక్‌కు దిగాడు. అప్పటివరకు సరదాగా సాగిన దేవీశ్రీ స్పీచ్ వున్నట్టుంటి సందర్భంగా లేకుండా.. నిర్మాత యలమంచిలి రవిశంకర్‌పైకి మళ్లింది. ఈవెంట్‌కు దేవీశ్రీ కాస్త లేటుగా రావడం.. dsp రాంగ్ టైమింగ్‌లో వచ్చారని ప్రొడ్యూసర్ అనడం దేవీశ్రీకి కోపం తెప్పించింది. దేవీశ్రీ రియాక్ట్ అవుతూ.. ‘ఎక్కువ టైం తీసుకుంటున్నానని అనొద్దు.. టైంకి పాట ఇవ్వలేదు.. టైమ్‌కి బ్యాక్ గ్రౌండ్ ఇవ్వలేదు.. టైమ్‌కి ప్రోగ్రామ్‌కి రాలేదు..అంటూ ఫైర్ అయ్యాడు దేవీశ్రీ.. మీకు నామీద ప్రేమ కంటే కంప్లైట్స్ ఎక్కువగా వున్నాడయన్నారు దేవీశ్రీ.
దేవీశ్రీ స్పీచ్ టాలీవుడ్‌లోనే కాదు.. పాన్ ఇండియాలో దుమారం రేపుతోంది. ఇదే వేదికపై మరో సందర్భంతో… క్రెడిట్ ఎవ్వరూ ఇవ్వరని.. తీసుకోవాలన్నాడు. అది రెమ్యునరేషన్ అయినా.. స్క్రీన్‌పైన క్రెడిట్ అయినా తప్పదన్నాడు. టీజర్ రిలీజ్ సందర్భంగా బ్యాక్‌గ్రౌండ్ తనదే అంటూ హింట్ ఇచ్చేలా పోస్టులు పెట్టి క్రెడిట్ తీసుకున్నాడు దేవీశ్రీ. ఆర్‌ఆర్ కోసం మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ రావడంతో.. ఎక్కడ క్రెడిట్ దక్కదోనన్న భయం దేవీశ్రీని వెంటాడుతోంది. దీంతో క్రెడిట్ అడిగి మరీ తీసుకుంటున్నాడు.
దేవీశ్రీ-బన్నీ.. దేవీశ్రీ-సుకుమార్ మధ్య మంచి రిలేషన్ వుంది. దేవీశ్రీ లేకుండా సినిమా తీయలేనని సుకుమార్ చాలా సందర్భాల్లో అన్నాడు. ఇలాంటి రిలేషన్ని నిర్మాత కాదని మరో మ్యూజిక్ డైరెక్టర్‌తో బ్యాక్‌గ్రౌండ్ కొట్టించగలడా? బన్నీ, సుకుమార్ పర్మిషన్ తీసుకునే.. బైట దర్శకుల దగ్గరకు నిర్మాత వెళ్లాడా? మరి దేవీశ్రీ నిర్మాతనే ఎందుకు టార్గెట్ చేశాడు? తెలుగులో పెద్ద హీరోలతో ఎక్కువ సినిమాలు చేస్తున్న టాప్ ప్రొడ్యూసర్‌ని టార్గెట్ చేయడం షాక్ ఇస్తోంది. .
పుష్ప వంటి మ్యూజికల్ హిట్ తర్వాత దేవీశ్రీని కాదని మరొకరితో బ్యాక్‌గ్రౌండ్ కొట్టించడం జరగని పని. సుకుమార్ అనుకున్న టైంలో షూటింగ్ పూర్తి చేయడు. ఎప్పటికప్పుడు వాయిదాపడుతూనే వుంది. రిలీజ్‌కు 10 రోజులు ముందు కూడా షూట్ చేస్తున్నాడు దర్శకుడు. ఆగస్ట్ 15న రావాల్సిన పుష్ప2 డిసెంబర్ 5కు వెళ్లినా.. లెక్కల మాష్టారికి ఈ టైం సరిపోలేదు. ఒకవైపు రీ షూట్స్… మరోవైపు రీ రికార్డింగ్ అనుకున్న టైంలో పూర్తి కావడం లేదు. డిసెంబర్ 5నే రిలీజ్ చేయాలంటే దేవీశ్రీ ఒక్కడి వల్లే అవుతుందా? అన్న భయం . దీంతో.. తమన్ సాయం తీసుకున్నారు. బన్నీ.. సుకుమార్‌ను సంప్రదించకుండా నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకునే సాహసం చేయరు. హీరో , డైరెక్టర్ ఓకె అన్న తర్వాతే బ్యాక్‌గ్రౌండ్ డెసిషన్ తీసుకోవడంతో.. దేవీశ్రీ వాళ్ల మీద కోపాన్ని స్టేజ్ మీద నిర్మాతపై చూపించాడా? అన్న వెర్షన్ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది.
దేవీశ్రీ కోపం ఎఫెక్ట్ పుష్ప2పై పడుతుందా? ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేసినా.. దేవీశ్రీ మాత్రం తన వెర్షన్ బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చేశాడని.. సినిమాలో అదే వుంటుందన్న ప్రచారమూ సాగుతోంది. ఒకవేళ దేవీశ్రీ ఆర్ఆరే వున్నా.. స్టేజ్ మీద మాటలతో నిర్మాతను హర్ట్ చేయడం చర్చగా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ బేనర్‌లో 3 సినిమాలకు దేవీశ్రీ వర్క్ చేస్తున్నాడు. అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ నుంచి ఆల్రెడీ దేవీశ్రీని తప్పించారట. ఈ ప్లేస్‌లో జీవీ ప్రకాష్ పేరు వినిపిస్తోంది. పవన్, హరీశ్ శంకర్ ఉస్తాద్ భగత్‌సింగ్‌కు వర్క్ చేస్తాడో లేదో తెలియాల్సి వుంది. మైత్రీ మూవీ మేకర్స్ రామ్‌చరణ్, సుకుమార్, దేవీశ్రీ కాంబోలో సినిమాను ఎనౌన్స్ చేసింది. పుష్ప2 చేసిన రచ్చతో మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవీశ్రీ వుంటాడో లేదో తెలియాల్సి వుంది. దేవీశ్రీ లేకపోతే సినిమాలు తీయలేనన్న సుకుమార్ డెసిషన్ ఏమిటో చూడాలి.
దేవీశ్రీ తన ఇగోను టచ్ చేస్తే ఎవరినీ వదిలిపెట్టడు. లెజెండ్ సినిమాకు దేవీశ్రీ మ్యూజిక్ ఇచ్చాడు. ఈవెంట్‌లో బోయపాటి మాట్లాడుతూ.. దేవీశ్రీని నిద్ర పోనీయకుండా చేయించుకున్నానన్నాడు . ఇది నచ్చని దేవీశ్రీ మైక్ తీసుకుని.. మ్యూజిక్ వుంటే తనే నిద్ర పోనని.. నిద్ర పోనీయలేదని చెప్పడం అబద్ద మంటూ.. స్టేజ్ మీదే బోయపాటికి గట్టిగా క్లాస్ పీకాడు.అయితే ఈ విషయాన్ని పట్టించుకోని దర్శకుడు.. ఆతర్వాత తీసిన ‘జయ జానకి నాయక’.. ‘వినయ విధేయ రామ’లో దేవీశ్రీతో కలిసి వర్క్ చేశాడు.మరోవైపు పుష్ప టు ఆర్ఆర్ వరకు అత్యంత వేగంతో సాగిపోతుంది. డిసెంబర్ 5న రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం అయిపోయింది. పుష్పం విడుదల మీద దేవిశ్రీ కామెంట్స్ పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. కానీ ఆర్ఆర్ ఫెయిల్ అయితే మాత్రం దేవిశ్రీ పండగ చేసుకోడు. నన్ను కాదని మీరు వెళ్తారా…. ఇప్పుడు చూడండి ఏమైందో అని మనసులో డాన్స్ లేస్తాడు.