Prabhas : స్పిరిట్‌’ ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుందంటే..

నిన్న, మొన్నటి వరకు ప్రభాస్‌ ‘సలార్‌’(Salaar), సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ‘యానిమల్‌’ (Animal) సినిమాల సందడి సరిపోయింది. ఇప్పుడు ఈ సినిమాల గురించి ప్రభాస్‌, సందీప్‌ మర్చిపోయారు. తమ నెక్స్‌ట్‌ సినిమాలపైనే కాన్‌సన్‌ట్రేట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ ‘కల్కి’ (Kalki) సినిమాకి సంబంధించిన వర్క్‌లో బిజీగా ఉన్నాడు.

నిన్న, మొన్నటి వరకు ప్రభాస్‌ ‘సలార్‌’(Salaar), సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ‘యానిమల్‌’ (Animal) సినిమాల సందడి సరిపోయింది. ఇప్పుడు ఈ సినిమాల గురించి ప్రభాస్‌, సందీప్‌ మర్చిపోయారు. తమ నెక్స్‌ట్‌ సినిమాలపైనే కాన్‌సన్‌ట్రేట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ ‘కల్కి’ (Kalki) సినిమాకి సంబంధించిన వర్క్‌లో బిజీగా ఉన్నాడు. ఇక సందీప్‌ తన నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌ ‘స్పిరిట్‌’ అని ఇంతకుముందే ఎనౌన్స్‌ చేసేశాడు. దీంతో ఇప్పుడు ఈ సినిమా గురించి డిస్కషన్‌ చేస్తున్నారంతా.

అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ఇప్పటివరకు స్టార్ట్‌ చెయ్యలేదు. సందీప్‌ మాత్రం ‘స్పిరిట్‌’ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తూనే ఉన్నాడు. ఈ సినిమాలో ఫస్ట్‌టైమ్‌ ప్రభాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తాడని చెప్పాడు. ఇప్పటివరకు సందీప్‌ చేసిన సినిమాల్లోని హీరోలు రిచ్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే. కానీ, ‘స్పిరిట్‌’లో మాత్రం హీరో మధ్య తరగతి నుంచి వచ్చినవాడిగా కనిపిస్తాడని చెబుతున్నాడు సందీప్‌.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌లో ఉన్నాడు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఓ ఫంక్షన్‌కి అతిథిగా హాజరైన సందీప్‌ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. తను చేసే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌ను రెడీ చేసేందుకు సందీప్‌ దాదాపు ఆరు నెలల టైమ్‌ తీసుకుంటాడు. అలా చూస్తే అతను చెప్పినట్టుగానే ఈ ఏడాది చివరలోనే సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.