Tiger vs Pathaan: బాహుబలి-2ని కొట్టే సినిమా వస్తోంది.. కాని ఆ సినిమాని మాత్రం కొట్టలేరు..?

బాహుబలి రూ.1800 కోట్లు పైనే రాబడితే, త్రిబుల్ ఆర్ 1260 కోట్ల పైనే రాబట్టింది. సో మరి బాహుబలి-2ని కొట్టే సినిమా వస్తుందా అంటే.. అక్కడ క్యూలో పెద్ద లిస్ట్ ఉంది. అందులో ఏ సినిమాకు అంత దమ్ముందో తెలుసుకోవాలంటే.. కొంచెం హిస్టరీలోకి వెళ్లాల్సిందే.

  • Written By:
  • Publish Date - June 3, 2023 / 06:19 PM IST

Tiger vs Pathaan: బాహుబలి-2 క్రియేట్ చేసిన రికార్డులు మామూలువి కాదు. రాజమౌళే తన మూవీ రికార్డుని తనే బ్రేక్ చేయలేకపోయాడు. బాహుబలి రూ.1800 కోట్లు పైనే రాబడితే, త్రిబుల్ ఆర్ 1260 కోట్ల పైనే రాబట్టింది. సో మరి బాహుబలి-2ని కొట్టే సినిమా వస్తుందా అంటే.. అక్కడ క్యూలో పెద్ద లిస్ట్ ఉంది. అందులో ఏ సినిమాకు అంత దమ్ముందో తెలుసుకోవాలంటే.. కొంచెం హిస్టరీలోకి వెళ్లాల్సిందే. నిజానికి ఇండియా నెంబర్ వన్ మూవీ బాహుబలి-2 కాదు.

హిందీ సినిమా దంగల్.. ఇండియన్ మార్కెట్‌లో వచ్చిన వసూళ్ల పరంగా బాహుబలి-2 నెంబర్ వన్. కాని చైనా వసూళ్ల వల్ల 2000 కోట్లతో దంగల్ నెంబర్ వన్‌గా నిలిచింది. సో ఇప్పుడు బాహుబలి-2, దంగల్ రికార్డులని బ్రేక్ చేసే సినిమా అంటే, టైగర్ వర్సెస్ పఠాన్ అంటున్నారు. దశాబ్ధాల తర్వాత ఖాన్లు కలిసి చేస్తున్నారు కాబట్టి ఇది రూ.3000 కోట్ల సినిమా అంటున్నారు. మరో వైపు ప్రాజెక్ట్ కే ఓపెనింగ్సే రూ.500 కోట్లు దాటుతాయని, ఇది గ్లోబల్ మూవీగా మారి, రూ.5000 కోట్లు రాబడుతుందనేంతగా రానా మాటలు తూటాల్లా పేలాయి. ఇండస్ట్రీతోపాటు మార్కెట్ లెక్కల మీద పట్టున్న రానా మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఇలా లెక్కేస్తే ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ చేసే సలార్ ఒకవేళ హిట్టైతే, కేజీయఫ్ మించేలా ఉంటే, బాహుబలిని కొడుతుంది. దంగల్ రికార్డుని బ్రేక్ చేస్తుందనుకోవచ్చు. ఇక హిందీలో యానిమల్ మూవీతో సందీప్ రెడ్డి వంగ కూడా బాహుబలి-2ని మించే మూవీతో వస్తున్నాడనే అంచనాలున్నాయి.

అన్నీంటికి మించి బాహుబలి-2 నే కాదు, దంగల్ రికార్డుని కూడా మహేశ్‌తో రాజమౌళి తీసే సినిమా బ్రేక్ చేసే ఛాన్స్ ఉందనే అంచనాలున్నాయి. 2025లోనే ఇది సాధ్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్థుతానికి 12కి పైనే సినిమాలు బాహుబలి-2, దంగల్ రికార్డుని బ్రేక్ చేసే సత్తా ఉన్నమూవీలుగా అంచనాలను అందుకుంటున్నాయి.