Guntur karam : ఓటీటీలో ఘాటెక్కిస్తున్నాడుగా..

సూపర్ స్టార్ (Superstar) మహేష్ బాబు (Mahesh Babu) మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో రూపొందించిన యాక్షన్ ఎంటర్టైనర్ (Action Entertainer) గుంటూరు కారం.. సంక్రాంతి బరిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ.. ప్రేక్షకుల అంచనాలను అంతగా అందుకోలేకపోనప్పటికీ.. కలెక్షన్ల పరంగా థియేటర్లలో రికార్డుల మోత మోగించింది.

 

 

సూపర్ స్టార్ (Superstar) మహేష్ బాబు (Mahesh Babu) మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో రూపొందించిన యాక్షన్ ఎంటర్టైనర్ (Action Entertainer) గుంటూరు కారం.. సంక్రాంతి బరిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ.. ప్రేక్షకుల అంచనాలను అంతగా అందుకోలేకపోనప్పటికీ.. కలెక్షన్ల పరంగా థియేటర్లలో రికార్డుల మోత మోగించింది.. గుంటూరు కారం సినిమా ఈనెల 9నుంచి ఓటిటీ లో సందడి చేస్తోంది.. థియేటర్లో విడుదలైన సినిమాలు అతి తక్కువ సమయంలోనే ఓటిటీ లోను స్ట్రీమింగ్ కు రావడంతో చాలామంది ఓటీటీ (OTT) లలో సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు కారం సినిమా నెట్ ఫ్లిక్స్ లో సందడి చేస్తూ టాప్‌లో దూసుకుపోతోంది..

జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పుడు కేవలం నాలుగు వారాల్లోనే ఓటీటీ లోకి వచ్చి మహేష్ బాబు ఫ్యాన్స్ కు సందడి తెచ్చింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో గుంటూరు కారం సినిమా ఓటీటీలో నేటి అందుబాటులో ఉంది.. ఈ మూవీ ఫస్ట్ డే ఒకింత మిశ్రమ స్పందన సొంతం చేసుకున్నప్పటికీ ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుని మొత్తంగా పలు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అందుకుంది.. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ము దులుపుతూ మహేష్ సత్తా ఏంటో చాటుతుంది..

మహేష్‌ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్‌ను డిజప్పాయింట్ చేసినప్పటికీ.. కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపింది.. గుంటూరు కారంలో మహేష్ బాబు లుక్స్‌కి, స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ కి అందరి నుండి విశేషమైన రెస్పాన్స్ వచ్చింది.. ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి, మావా ఎంతైనా సాంగ్స్‌పై నెగటివిటీ వచ్చినప్పటికీ.. మహేష్‌ ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్ నుంచి సూపర్ గా రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.. త్రివిక్రమ్ తన రేంజ్‌ కి తగ్గ సినిమా తీయలేదన్న కామెంట్లు వినిపించినప్పటికీ.. తన పాత్ర వరకు మహేశ్ ఇరగదీసాడంటూ ప్రశంసలు వచ్చాయి.. దీంతో.. ధియేట్లకు వెళ్లని ప్రేక్షకులతో పాటు, మహేశ్ ఫ్యాన్స్‌ కూడా ఓటీటీలోనూ గుంటూరు కారం మూవీని చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపించడంతో ఓటీటీలోనూ ఈ మూవీ టాప్‌ పొజిషన్‌లో దూసుకపోతోంది..