గుజరాత్‌కు చెందిన రియా సింఘా మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని సొంతం చేసుకుంది. వరల్డ్ మిస్ యూనివర్స్ 2024 పోటీలలో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించింది. మిస్ యూనివర్స్ ఇండియా 2024 ఫైనల్ ఆదివారం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించారు. 19 ఏళ్ళ రియా సింఘా… మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ 2024లో భారత్ కు ప్రాతినిధ్యం వహించనుంది. మిస్ యూనివర్స్ ఫైనల్ లో జడ్జి ప్యానెల్ లో నిఖిల్ ఆనంద్, నటి ఊర్వశి రౌతాలా, వియత్నామీస్ స్టార్ న్గుయెన్ క్విన్, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ రియాన్ ఫెర్నాండెజ్, పారిశ్రామికవేత్త రాజీవ్ శ్రీవాస్తవ పాల్గొన్నారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన రియా సింఘా మోడల్. రియా ప్రస్తుతం పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చేస్తోంది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఇక ఫైనల్ లో గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె… ఇక్కడికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాను కాబట్టి నేను నిజంగా ఈ ఫైనల్ లో విజయానికి అర్హురాలిని అని భావిస్తున్నా అంటూ వ్యాఖ్యానించింది. రియా సింఘా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. మెక్సికోలో ఇంటర్నేషనల్ మిస్ యూనివర్స్ టైటిల్ ఆమె కచ్చితంగా గెలుస్తుందని నటి ఊర్వశి రౌతాలా పేర్కొన్నారు.