MEGASTAR CHIRANJEEVI: టాలీవుడ్‌లో చిరు తర్వాత చిరు అంటే అయితే పవన్ కళ్యాణ్ అవ్వాలి. లేదా చిరు వారసుడు రామ్ చరణ్ అవ్వాలి. కాని ఇద్దరికీ ఆఛాన్స్ లేదు. ఎందుకంటే ఇద్దరికీ ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉంది. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తి చిరు కాబట్టి, తన స్థానంలో మరో స్టార్ అంటే.. ఖచ్చితంగా బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఉండాలి. ఈ రూల్ పరంగా చూస్తే చిరు తర్వాత ఆ స్థానంలో అంతలా ఎదుగుతారో లేదో కాని, అలా ఒంటరిగా వచ్చి దూసుకెళుతోన్న స్టార్స్ లిస్ట్ పెరుగుతోంది.
Jr NTR: ఊహించని సర్‌ప్రైజ్.. దేవర నుంచి ఫస్ట్ సింగిల్
రవితేజ అలా వచ్చినవాడే. కాని, మరీ మెగాస్టార్ అంత స్థాయిలో దూసుకెళ్లే పరిస్థితి లేదు. న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు ఉన్నా, క్రౌడ్ పుల్లర్ అనిపించేంత ఇమేజ్ రాలేదు. విజయ్ దేవరకొండ, సిద్దూ, విశ్వక్ సేన్, నవీన్ పోలిశెట్టి, అడవి శేష్ ఇలా అంతా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి, హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకెళుతున్నారు. అదేంటో పాన్ ఇండియా లెవల్లో కూడా వీళ్లకి ఐతే హిట్లు, లేదంటే మంచి నటులుగా గుర్తింపు దక్కింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఏకంగా చరణ్, బన్నీ, తారక్ రేంజ్‌కి ఎదగటమే కాకుండా.. సాలిడ్ హిట్ పడితే వాళ్లకి పోటీ ఇస్తాడనేంత క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే ఇందులో అడవి శేష్ హీరోగానే కాదు రైటర్‌గా, దర్శకుడిగా తన కెరీర్‌ని తానే నిర్మించుకోగలిగాడు. విశ్వక్ సేన్ అదే బాటలో నటుడిగా, దర్శక నిర్మాతగా గట్టెక్కాడు. సిద్దూ టిల్లూ స్క్వేర్‌తో వందకోట్లు కాదు.. రెండొందల కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చాలా మంది స్టార్స్ వస్తుంటారు. కాని అదేంటో ఆల్రెడీ బ్యాగ్రౌండ్‌తో ఓ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోల వారసులనే భయపెట్టేస్తున్నారు ఈ ఆరుగుగు తెలుగు హీరోలు. విజయ్ దేవరకొండ, నాని, సిద్దూ జొన్నల గడ్డ, విశ్వక్ సేన్, నవీన్ పోలిశెట్టి, అడవి శేష్ ఈ ఆరుగురికి యూత్‌లో క్రేజ్, మార్కెట్ దానికి తోడు మంచినటులుగానే గుర్తింపు దక్కింది. సిద్దూ, విశ్వక్, అడవి శేష్ అయితే రైటింగ్, డైరెక్షన్ లో ప్రవేశించి, తమ ఫ్యూచర్‌ని తామే నిర్మించేసుకుంటున్నారు. కాబట్టే నెక్ట్స్ మెగాస్టార్ కేవలం గొప్ప నటుడు మాత్రమేకాదు, దర్శక రచయిత కూడా కావొచ్చనే అభిప్రాయం పెరిగింది.