టాలీవుడ్ లో ఇప్పుడు ఓ పెళ్లి హాట్ టాపిక్ అవుతోంది. రెండు కుటుంబాలను ఈ పెళ్లి బంధువులను చేసింది. ఆ పెళ్లి ఏదో మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది కదా…? ఎస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ పెళ్లి. సైలెంట్ గా ఎవరికి తెలియకుండా ఈ కొత్త హీరో ఎంగేజ్మెంట్ చేసుకుని సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాడు. వార్ 2 షూట్ లో ఉన్నాడు అనుకున్న ఎన్టీఆర్ సైలెంట్ గా హైదరాబాద్ లో ప్రత్యక్షం కావడం సంచలనం అయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో సంచలనం అయింది.
శివాని అనే అమ్మాయిని నార్నే నితిన్ వివాహం చేసుకుంటున్నాడు. ‘మ్యాడ్’ మూవీతో సూపర్ హిట్ కొట్టి… ‘ఆయ్’ సినిమాతో సైలెంట్ హిట్ కొట్టి పెళ్లి కూడా సైలెంట్ గానే చేసుకుంటున్నాడు ఈ హీరో. ఇక ఈ పెళ్లి ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఒక పండుగలా ఉంది. కారణం నార్నే నితిన్ చేసుకునే అమ్మాయి విక్టరీ వెంకటేష్ కు బంధువు కావడమే. అసలు ఆమె ఎవరూ ఏంటీ అనే విషయాలను తెలుసుకోవడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ను జల్లెడ పట్టారు. అసలు విషయం బయటకు రాగానే సోషల్ మీడియాను ఒక ఊపు ఊపారు.
నార్నె నితిన్ ఎంగేజ్మెంట్ చేసుకున్న శివానీ అనే అమ్మాయి… హీరో దగ్గుబాటి వెంకటేష్ ఫ్యామిలీకి బంధువు అయిన అయిన తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్.. స్వరూప దంపతుల కుమార్తె. అంటే ఆమె వెంకి మామకు కజిన్ డాటర్ అన్నట్టు. వెంకి మామకు డాటర్ అంటే… జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ కాబట్టి… ఆమె ఎన్టీఆర్ కు చెల్లెలి వరుస అవుతుంది. సో ఇప్పుడు ఎన్టీఆర్ కు వెంకటేష్ బాబాయ్ లెక్క. ఇలా ఈ పెళ్లి వెంకి మామను, ఎన్టీఆర్ ను బాబాయి అబ్బాయిని చేసింది. బావమరిది ఎంగేజ్మెంట్కు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో సహా ట్రెడీషనల్ డ్రెస్లో వచ్చి షేక్ చేసాడు. ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా హాజరు అయ్యారు.