టాలీవుడ్ లో మొన్నటి వరకు మెగాస్టారే నెంబర్ వన్… కాని ఇప్పుడు నెంబర్ వన్ కి క్రైటీరియా ఏంటో అర్ధం కాని పరిస్తితి.. ఎవరూ కూడా టాలీవుడ్ నెంబర్ వన్ అనిపించుకునే ప్రయత్నం చేయట్లేదు. అసలు చాలా వరకు పెద్ద హీరోల ఫ్యాన్స్ లో కూడా అలాంటి డిస్కర్షన్ రావట్లేదు. అందరి ఫోకస్ పాన్ ఇండియా మీదే.. ఏదున్నా అక్కడే తేల్చుకోవాలని హీరోల్లానే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అంటే పాన్ ఇండియా ని శాసించేవాడే ఆటోమేటిగ్గా టాలీవుడ్ ని శాసించనట్టౌతుంది. అందుకే ప్రజెంట్ టాలీవుడ్ నెంబర్ వన మొనగాడేవరనే డిస్కర్సనే బంద్ అయిపోయింది. బేసిగ్గా టాలీవుడ్ నెంబర్ వన్ అంటే తెలుగు హీరోల మధ్యే పోటీ… కాని పాన్ ఇండియా నెంబర్ వన్ అనిపించుకోవాలంటే, తమిళ,మలయాళ, కన్నడ హీరోలతో పాటు హిందీ హీరోలని కూడావెనక్కి నెట్టాలి… విచిత్రం ఏంటంటే పాన్ ఇండియా మార్కెట్ అంటే అదే, టాలీవుడ్ మార్కెట్ అయిపోయింది… ఎందుకలా? ప్రభాస్, ఎన్టీఆర్ తో ఇంత కసిగా వన్ బై వన్ ఇలా డజన్ల కొద్ది పాన్ ఇండియా మూవీలకే ఎందుకు కమిటౌతున్నారు.. ఇక వాళ్లు ఒకప్పటిలా ఉండలేరా? పాన్ ఇండియా కథలు, దర్శకులతోనే పర్మినెంట్ గా ప్రయాణం చేయాల్సిందేనా?
పాన్ ఇండియా ఇమేజ్ వస్తే, ఇక జీవితాంతం పాన్ ఇండియా హీరోగా నే కొనసాగాలి. అది పులి మీద స్వారీలాంటిది… పాన్ ఇండియా లెవల్లో త్రిబుల్ ఆర్, దేవరతో దూసుకెళ్లిన ఎన్టీఆర్ వరుసగా 4 పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్ ఆల్రెడీ అరడజన్ పాన్ ఇండియా మూవీలు చేశాడు.
మరో ఆరడజన్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ప్రతీ ఫిల్మ్ ఇండస్ట్రీలో లోకల్ నెంబర్ వన్ అనే డిస్కర్షనే లేదు. టాలీవుడ్ లో అయితే ఇక్కడ నెంబర్ వన్ అనిపించుకోవాలని, అలా పిలిస్తే సంతోషపడే పరిస్థితుల్ని కూడా ఊహించటం కష్టం
అందరి టార్గెట్ పాన్ ఇండియానే. కార్తికేయ2 తర్వాత నిఖిల్, హనుమాన్ తర్వాత తేజా లాంటి టైర్ త్రీ హీరోలు కూడా ఒక్కసారి పాన్ ఇండియా హిట్ ని రుచి చూశాక, సౌత్ వరకే పరిమితమవ్వాలనుకోవట్లేదు. రిస్క్ చేసైనా పాన్ ఇండియా మీద దాడి చేయాలనుకుంటున్నారు
అలాంటిది, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్, ఇలా పాన్ ఇండియాని శాసించే స్టేజ్ కెల్లిన స్టార్స్ ఎలా తగ్గుతారు. కాని అది అంత తేలిక కాదు. ప్రభాస్ ప్రజెంట్ ది రాజా సాబ్ , ఫౌజీ తర్వాత స్పిరిట్ కమిటయ్యాడు. సలార్ 2, కల్కీ 2 కూడా చేసేందుకు తను రెడీ అవుతున్నాడు. ఆతర్వాత ఏంటంటే ఈ అరడజన్ టాప్ డైరెక్టర్స్ తోనే కొత్త ప్రయోగాలకు కమిటవ్వాల్సిందే..
అలాని అరడజన్ రాజమౌలిలు, అరడజన్ సుకుమార్ లు లేరు… కాని కావాలి… పులి మీద స్వారిలీనే, ఒక్కసారి పాన్ ఇండియా హిట్లు సొంతమయ్యాక, లోకల్ మార్కెట్ కే పరిమితమైతానంటే, అడ్రస్ లేకుండాపోయే ఛాన్స్ఉంది. అందుకే కష్టమో నష్టమో శంకర్ స్వింగ్ లో లేకున్నా గేమ్ ఛేంజర్ ని తనతో చేశాడు చరణ్. సుకుమార్ పుష్ప2 తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తూనే, నెల్సన్ దిలీప్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డిని లైన్లో పెడుతున్నాడు బన్నీ… ఇక యష్ కూడా కేజీయఫ్ 2 తర్వాత సాలిడ్ కథలేక, అతి కష్టం మీద రెండేళ్లు టైం తీసుకుని టాక్సిక్ ప్రాజెక్ట్ కి కనెక్ట్ అయ్యాడు. సో తెలుగు,తమిల్, మలయాళం, కన్నడ , హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు నెంబవర్ వన్ ఎవరనే డిస్కర్షన్ ఉండేది.
కాని ఇప్పుడు అంతా పాన్ ఇండియా మార్కెట్ లో నెంబర్ వన్ అనిపించుకుంటున్నారు.ఐతే పాన్ఇండియా మార్కెట్ మాత్రం మరీ టాలీవుడ్ మార్కెట్ లా తయారైంది. పాన్ ఇండియాని ఎక్కువ ప్రబాస్, ఎన్టీఆర్, బన్నీ, చరణ్, అండ్ కో కమాండ్ చేస్తుండటంతో, అక్కడ పోటీ అంటే మిగతా భాషల హీరోలు సైడ్ కి వెళ్లపోతున్నారు… మొత్తం తెలుగు హీరోలే పాన్ఇండియా లెవల్లో వెలిగిపోతున్నారు.