అక్కినేని వారి ఇంటి మరో పెళ్లి బాజా మొగనుంది. అక్కినేని హీరోలు నాగ చైతన్య రెండో సారి పెళ్లి పీటలు ఎక్కుతున్న సమయంలోనే అఖిల్ కూడా పెళ్ళికి సిద్దమయ్యాడు. ఈ విషయాన్ని నాగార్జున తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వెల్లడించారు. శ్రేయా భూపాల్ తో నిశ్చితార్ధం చేసుకోగా ఆ వివాహం అప్పుడు క్యాన్సిల్ అయింది. ఇక అక్కడి నుంచి అఖిల్ సింగిల్ గానే ఉంటూ వస్తున్నాడు. ఎవరో హీరోయిన్ ను అఖిల్ పెళ్లి చేసుకుంటాడు అనే ప్రచారం జరిగినా అది ముందుకు వెళ్ళలేదు. సినిమాలపై అఖిల్ ఫోకస్ చేసాడు.
సినిమా కెరీర్ అఖిల్ కు ఆశించిన రేంజ్ లో లేదు అనే చెప్పాలి. ప్రస్తుతం కెరీర్ పరంగా అఖిల్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో కాస్త డిప్రెషన్ లో ఉన్నాడనే ప్రచారం కూడా ఉంది. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పటి వరకు అఖిల్… తన కెరీర్ లో ఒక్క హిట్ కూడా కొట్టలేదు. ఈ సమయంలో పెళ్లి చేసుకోవడానికి అఖిల్ రెడీ అయ్యాడు. జైనాబ్ రావ్ద్ జీ అనే అమ్మాయిని అఖిల్ పెళ్ల్లి చేసుకుంటున్నాడు అని… నాగార్జున ప్రకటించారు.
దీనితో అసలు జైనాబ్ ఎవరూ అంటూ సోషల్ మీడియాలో వెతికేస్తున్నారు నెటిజన్లు. అయితే సోషల్ మీడియాలో ఆమె తన ప్రొఫైల్ మెయింటేన్ చేయకపోయినా… కొంత సమాచారం మాత్రం ఆమె గురించి అందుబాటులో ఉంది. జైనాబ్… జుల్ఫీ రావ్ద్ జీ కుమార్తె. దుబాయ్ లో పుట్టిన ఆమె… ఎక్కువగా అక్కడే పెరిగింది. అలాగే లండన్ లో ఉన్నత చదువులు చదువుకుని… హైదరాబాద్ లో కూడా కొన్ని వ్యాపారాలు చూస్తున్నట్టు సమాచారం. అఖిల్ తో ఆమె ఓ ఈవెంట్ లో పరిచయం అయ్యారని… అక్కడి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది అని తెలుస్తోంది.
అయితే ఆమె తండ్రి ఏపీ రాజకీయ వర్గాల్లో అయిదేళ్ళ క్రితం బాగా ఫేమస్ అయ్యారు. జుల్ఫీ రావ్ద్ జీని వైఎస్ జగన్ తన సలహాదారుగా నియమించుకున్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ లోని రోడ్ నంబర్ 7లో వీరు నివాసం ఉంటున్నారట. ZR రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటుగా పలు వ్యాపారాల్లో ఆయన అగ్రగామిగా ఉన్నారు… నిర్మాణ రంగంలో దాదాపు ఆయనకు 30 ఏళ్ళ అనుభవం ఉందని సమాచారం. మధ్య-ప్రాచ్య మరియు దూర-ప్రాచ్య దేశాలకు క్యాబినెట్ హోదాతో ఆయనను అప్పుడు జగన్ నియమించారు. ఆయన కుమార్తెనే జైనాబ్ రావ్ద్ జీ. వస్తున్న వార్తల ప్రకారం… నాగార్జునతో ఆయనకు వ్యాపార భాగస్వామ్యం కూడా ఉందని… అలా ఇప్పుడు బంధువులు కూడా అవుతున్నారని సినీ వర్గాలు అంటున్నాయి.