ఒకప్పుడు 100 కోట్ల వసూళ్లు టాలీవుడ్ హీరోలకి పెద్ద మ్యాటర్. కాని ఇప్పుడు వందకోట్ల రెమ్యనరేషన్ కూడా మన హీరోలకి పెద్ద మ్యాటర్ కాదు. ఏకంగా వేయికోట్ల వసూళ్లకి రెబల్ స్టార్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ వరకు మన హీరోలు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. కాబట్టే వెయ్యికోట్ల వసూళ్ళు కూడా ఇప్పుడు చిన్న విషయం అయిపోయాయి. మరి నెక్ట్స్ టార్గెట్ ఏంటంటే ఒకటే ఒకటి, దంగల్ ఓవరాల్ వసూళ్ల రికార్డుని బ్రేక్ చేయాలి. బాహుబలి 2 తాలూకు 1850 కోట్లు, దంగల్ తాలూకు 2 వేల కోట్ల రికార్డులని రీచ్ అవటమో, బ్రేక్ చేయటమో ఇదే, తెలుగు స్టార్లు ప్రజెంట్ టార్గెట్. దాన్ని పుష్ప 2 తో బన్నీ టార్గెట్ చేస్తున్నాడు. గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ కూడా టార్గెట్ చేశాడు. కాని ఎందుకో ఎన్టీఆర్ కే ఆ అవకాశం 100 కు 90 శాతం ఉందంటోంది బీటౌన్ బ్యాచ్. అదెలానో చూసేయండి.
కల్కీ 1200 కోట్లు రాబట్టింది. సలార్ 750 కోట్లు, యానిమల్ 900 కోట్లు రాబడితే, త్రిబుల్ ఆర్ 1350 కోట్లు, కేజీయఫ్ 2 మూవీ 1200 కోట్లు రాబట్టింది. సో 1000 నుంచి 1400 కోట్లు ఇప్పడు పెద్ద విషయం కాదు. బాహుబలి 2 తాలూకు 1850 కోట్ల రికార్డు, దంగల్ 2 వేల కోట్ల రికార్డుని ఎవరు టచ్ చేస్తారు. ఎవరు బ్రేక్ చేస్తారనేదే పాన్ ఇండియా లెవల్లో అది నెక్ట్స్ లెవల్ టార్గెట్.
దీన్ని టచ్చేసినా, రీచ్ అయినా, బ్రేక్ చేసినా ఆ హీరో పాన్ ఇండియా లెవల్లో ప్రతీ స్టార్ ని దాటేసినట్టే.. ఆ ప్లేస్ కోసంమే రెండు వేల కోట్ల కళతో పుష్ప2 ని వందకోట్ల ఖర్చుతో ప్రమోట్ చేస్తున్నారు. కాని బాహుబలి 2 కి దేశవ్యాప్తంగా పూనకాలొస్తేనే 1850 కోట్లొచ్చాయి… త్రిబుల్ ఆర్ కి ప్రపంచ వ్యాప్తంగా పూనకాలొస్తేనే 1350 కోట్లు సొంతమయ్యాయి.
అంటే రాజమౌలి కూడా తన సినిమా రికార్డుల్ని, తానే బ్రేక్ చేయటం కాదు, కనీసం రీచ్ కూడా కాలేకపోతున్నాడు. అందుకే ఆ 1850 కోట్ల రికార్డుని ఎవరు రీచైనా, బ్రేక్ చేసినా ఆఫ్టర్ బాహుబలి అన్న మాటే రాదు. దాన్ని మించి దంగల్ 2 వేల కోట్ల రికార్డుని రీచైనా, బ్రేక్ చేసినా ఆ మూవీ చరిత్ర స్రుష్టించినట్టే.. కాని గేమ్ ఛేంజర్, పుష్ప2 తోపాటు మరే సౌత్ సినిమాలు ఆ రికార్డుని ఈమధ్య కాలంలో బ్రేక్ చేసేలా లేవు. చేస్తే గీస్తే సందీప్ రెడ్డి తో ప్రభాస్ చేయబోయే స్పిరిట్ లేదంటే, మహేశ్ బాబుతో రాజమౌలి తీయబోయే పాన్ వరల్డ్ మూవీలే ఆ పని చేసే ఛాన్స్ ఉంది.. అందుకు చాలా టైం పడుతుంది
కాకపోతే వార్ 2 మూవీ మాత్రం ఈజీగా 2 వేల కోట్లని రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హ్రితిక్, ఎన్టీఆర్ ఇద్దరికీ యావరేజ్ మూవీలతో కూడా చెరో 500 కోట్లు రాబట్టే సత్తాఉంది. అదే సాలిడ్ టాక్ తో వచ్చినమూవీలైతే ఇద్దరు చెరో వెయ్యికోట్ల వసూళ్లు రాబట్ట గల్గుతారు. కాబట్టే వార్ 2 లాంటి యాక్షన్ డ్రామ ఈజీగా బాహుబలి 2, దంగల్ రికార్డులని బ్రేక్ చేసే అవకాశం ఉంది. అన్నీంటికంటే ముఖ్యంగా మహేశ్, రాజమౌలి మూవీతో పాటు, స్పిరిట్ సినిమాల కంటేముందు వార్ 2నే విడుదల కాబోతోంది.
కాబట్టి వార్ 2 తో ఎన్టీఆర్ ఎకౌంట్ లో మరో పెద్ద రికార్డు పడేలా ఉంది. ఇంత ఖచ్చితంగా ఈ సినిమాకు ఆరికార్డు వచ్చేఛాన్స్ఉందనటానికి రీజన్, ప్రీరిలీజ్ బిజినెస్ 1200 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు ఆల్ మోస్ట్ డీల్ సెట్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే, రెండు వేల వసూళ్ల రికార్డు బ్రేక్ చేసిన రికార్డు కూడా ఎన్టీఆర్ ఎకౌంట్ లో పడొచ్చు.. ఇది జరగుతుందో లేదో తేలాలంటే, ఆగస్ట్ 15 తర్వాత వచ్చే సినీసునామీతోనే కన్ఫామ్ అవుతుంది.