ఆస్కార్ వేడుక ముగిసిన వెంటనే.. ఎన్టీఆర్ ఇండియా తిరిగి వచ్చేశాడు. ఆర్‌ఆర్‌ఆర్ టీంతో ఎంజాయ్ చేసి… ఇంకో వారం తర్వాత వస్తాడనుకుంటే.. రెండో రోజే హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగాడు. ఆస్కార్ ప్రదానోత్సవంలో పాల్గొన్న ఎన్టీఆర్ ఎందుకు వెంటనే ఇండియా వచ్చేశాడు.
ఆస్కార్ వేడుకకు తారక్ అందరికంటే లేటుగా వెళ్లి తొందరగా రిటర్న్ అయ్యాడు. రాజమౌళి…రామ్‌చరణ్.. కీరవాణి దంపతులు అమెరికాకు రెండు వారాలు ముందే వెళ్లారు. వీళ్లతోపాటే.. ఎన్టీఆర్ కూడా వెళ్లాల్సి వున్నా.. తారకరత్న చనిపోవడంతో క్యాన్సిల్ చేసుకుని.. ఆస్కార్ వేడుకకు ఐదారు రోజుల ముందు వెళ్లాడు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో దిగిన ఎన్టీఆర్ .. ఆస్కార్ వేడుకలో పాల్గొనడం ఎంతో సంతోషంగా వుందని… కీరవాణి, చంద్రబోస్ అవార్డు తీసుకున్న క్షణాలను ఎప్పటికీ మరిచిపోనన్నాడు.
ఎన్టీఆర్ ఆస్కార్‌కు వెళ్లి కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆస్కార్ సందర్భంగా సోషల్ మీడియాలో ఎక్కువసార్లు సెర్చ్ చేసిన సినిమాగా ఆర్‌ఆర్‌ఆర్ నిలిచింది. ఎక్కువ సార్లు ప్రస్తావన వచ్చిన నటీనటుల్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ మొదటి, రెండు స్తానాల్లో నిలిచిఆరు. హాలీవుడ్‌లో ఎంతో మంది ప్రముఖులు వున్నా.. అందరికంటే ఎక్కువగా ఎన్టీఆర్ పేరు ప్రస్తావన రావడం విశేషం.
ఆస్కార్ వేడుక ముగిసిన వెంటనే ఎన్టీఆర్ హుటావుడిన హైదరాబాద్ వచ్చేయడానికి కారణం లేకపోలేదు. ఫిబ్రవరి 24న మొదలు కావాల్సిన కొరటాల సినిమా వాయిదాపడింది. ఈనెల 18న సినిమాను పూజా కార్యక్రమంతో మొదలుపెడతారని తెలిసింది. దీని కోసమే ఆర్‌ఆర్‌ఆర్ టీంతో ఎంజాయ్ చేయకుండా.. వచ్చేశాడంటున్నారు. కొరటాల సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా… సైఫ్ అలీఖాన్ విలన్‌గా ఎంపికయ్యారు. ఆల్రెడీ సినిమా కోసం.. 15 కోట్లతో భారీ సెట్ కూడా వేశారు. ఏప్రిల్ నుంచి రెగ్యులర్‌షూటింగ్ స్టార్ట్ చేసి.. 2024 ఏప్రిల్ 5న థియేటర్స్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో వున్నారు. మరో వైపు వేరే టాక్ వినిపిస్తుంది. ఆస్కార్ కేక్ ముందు రాంచరణ్ కోసం స్పెషల్ గా పబ్లిసిటీ ప్లాన్ చేశారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ కి వెళ్ళినప్పుడు రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసే తిరిగారు. కానీ అప్పుడు రాంచరణ్ కి తగినంత పబ్లిసిటీ రాలేదని చిరంజీవి ఫీల్ అయ్యాడట. సెకండ్ స్పెల్ లో రాంచరణ్ ని ముందే పంపారు. చెర్రీ పబ్లిసిటీ బాధ్యత ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ కి అప్ప జెప్పారు. ప్రైవేట్ ఇంగ్లీష్ చానెల్స్ లో ఇంటర్వ్యూలు ఆర్గనైజ్ చేశారు. రాంచరణ్ భార్య ఉపాసన దగ్గరుండి ఇవన్నీ చూసుకున్నారు. జరుగుతున్న హడావుడి అంతా గమనిస్తున్న ఎన్టీఆర్ ఎందుకో దూరం గానే ఉన్నాడు. అదే దూరం మైంటైన్ చేస్తూ హడావుడిగా ఆస్కార్ కి వెళ్లి వచ్చేశాడు.