ప్రభాస్ మూవీ స్పిరిట్ కి మ్యూజిక్ కంపోజ్ చేసే ఛాన్స్ తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ కి వచ్చింది. కాదుపొమ్మన్నాడు. నిజానికి మహేశ్ గుంటూరు కారం సినిమాకు కూడా అనిరుద్ నే తీసుకోవాలనుకున్నారు. తమన్ పవి తనం నచ్చక మహేశే పిలిచి ఆఫర్ ఇస్తే, కుదరదన్నాడు. దీంతో ప్రాజెక్టు లోంచి తీసేద్దామనుకున్న తమన్ ని మళ్లీ కంటిన్యూ చేయాల్సి వస్తోందట.
ఇంతకి ప్రబాస్, మహేశ్ బాబు లాంటి స్టార్స్ ఇచ్చిన ఆఫర్స్ వద్దనటానికి కారణం, అనిరుద్ తీరిక లేనంత బిజీ అవ్వటం. కాని తను బడా స్టార్లకు నో చెప్పటం వల్ల బాగా బలుపు పెరిగిందనే కామెంట్స్ పెరిగాయి.
ప్రజెంట్ నేషనల్ వైడ్ గా అనిరుద్ ఫేమస్ అయ్యాడు. మొన్న విక్రమ్ తో హిట్ కొట్టాడు. తర్వాత జైలర్ తో హిట్ సొంతమైంది. రెండీంటికి అనిరుద్ మ్యూజిక్కే ప్రాణం. ఇప్పుడు షారుఖ్ జవాన్ పాటలు తూటాల్లా పేలటంతో దేశవ్యాప్తంగా అనిరుద్ పేరు మారుమోగుతోంది. రెహమాన్ 8 కోట్లు తీసుకుంటుంటే, 10 కోట్ల రెమ్యునరేషన్ తో అనిరుద్ ఎప్పుడో వార్తల్లో కెక్కాడు. ఇప్పుడు తన మ్యూజిక్ తో వార్తై కూర్చున్నాడు. ప్రబాస్, మహేశే కాదు, హ్రితిక్, సల్మాన్ చాన్స ఇచ్చినా నో అన్నాడట. కారణం ముందే హ్రితిక్, రణ్ వీర్ సింగ్ సినిమాలకు కమిటవ్వటం. విజయ్ , సూర్య, కమల్ మూవీలు ఒప్పకోవటం అని తెలుస్తోంది.