పుష్ప అంటే ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్. డైలాగ్‌కు తగ్గట్టుగానే బాక్సాఫీస్‌ను ఊచకోత కోస్తున్నాడు ఐకా న్‌స్టార్ అల్లు అర్జున్. ఎన్నో అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప-2 సినిమా.. అంచనాలను మించి దూసుకెళ్తోంది. రిలీజ్ ఐన ప్రతీ ప్లేస్‌లో పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. మొదటి రోజు ఇండియా వైడ్‌గా 175 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్‌కు తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు పుష్పరాజు. మొదటి రోజు తెలుగులో పుష్ప-2 95 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. హిందీలో 67 కోట్లు, తమిల్‌లో 7 కోట్లు, కన్నడలో కోటి, మళయాలంలో 5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకూ ఇండియన్ బిగ్గెస్ట్ సినిమాలుగా చెప్పుకుంటున్న చాలా సినిమాల రికార్డ్‌ను బ్రేక్ చేసింది పుష్ప-2 సినిమా.
ఇండియన్ సినిమాకు ఆస్కార్ తెచ్చిపెట్టిన ట్రిపులార్ సినిమా మొదటి రోజు కలెక్షన్ 133 కోట్లు. తెలుగు సినిమా పేరును ప్రపంచం మొత్తం వినిపించేలా చేసిన బాహుబలి సినిమా ఫస్ట్ డే కలెక్షన్ 121 కోట్లు. ఇండియా అంటే కేవలం హిందీ సినిమాలే కాదు అని ప్రూవ్ చేసిన కేజీఎఫ్ సినిమా మొదటి రోజు కలెక్షన్ 116 కోట్లు. ఇప్పటి వరకూ ఇండియన్ బిగ్గెస్ట్ సినిమాలు ఇవే. కానీ ఇప్పుడు ఈ మూడు సినిమా రికార్డ్స్‌ను మొదటి రోజే బ్రేక్ చేశాడు పుష్ప. అల్లు మెగా కుటుంబాల మధ్య గ్యాప్ వల్ల పుష్ప-2 సినిమా మీద చాలా వ్యతిరేకత వచ్చింది. మెగా ఫ్యాన్స్ చాలా మంది సినిమా మీద సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం కూడా చేశారు. కొన్ని ప్రాంతాల్లో సినిమాను బాయ్‌కాట్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. కానీ పుష్ప మాత్రం వాటన్నిటినీ పటాపంచలు చేసింది. పుష్ప-2 సినిమాను ప్రపంచవ్యాప్తంగా మొత్తం 80 దేశాల్లో రిలీజ్ చేశారు. ఏడు ఫార్మాట్‌లు ఆరు భాషల్లో సినిమాను విడుదల చేశారు. భాషతో సంబంధం లేదు. దేశంతో పని లేదు. రిలీజైన ప్రతీ ఏరియాలో ప్రతీ దేశంలో తగ్గేదే లే అంటున్నాడు అల్లు అర్జున్. మొదటి రోజు రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబట్టి తాను నిజంగానే వైల్డ్ ఫైర్ అని ప్రూవ్ చేసుకున్నాడు.