టాలీవుడ్(Tollywood)లో మోస్ట్ అవైటింగ్ మూవీస్‌లో దేవర ఒకటి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) కాంబోలో వస్తున్న ఈ మూవీపై పాన్ ఇండియా లెవెల్‌లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ మూవీ నుంచి వస్తున్న అప్‌డేట్స్.. రీసెంట్‌గా వచ్చిన గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఈ మూవీతో జూనియర్ రికార్డుల వేట ఖాయమంటూ ఫ్యాన్స్ హడావిడి మొదలు పెట్టేశారు. ఇక ఈ మూవీతో పాటు బాలీవుడ్ మూవీ వార్-2 పై కూడా ఎన్టీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టాదడు. ఈ రెండు సినిమాలను పూర్తి చేశాక ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. ఐతే లేటెస్ట్ గా యువ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీతో జూనియర్‌ను కలిసాడన్న వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది.
రాహుల్ సంకృత్యన్ ఒక పీరియాడికల్ కథతో ఎన్టీఆర్ (NTR) ని కలిసినట్లు న్యూస్ వినిపిస్తోంది.. టాక్సీవాలా తో తొలి సినిమా సర్ ప్రైజ్ హిట్ అందుకున్న రాహుల్ సెకండ్ అటెంప్ట్ గా చేసిన నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా కూడా సూపర్ హిట్ అందుకుంది. ఈ రెండు సినిమాలతో డైరెక్టర్ గా తనకంటూ ఒక మార్క్స్ సెట్ చేసుకున్న రాహుల్ సంకృత్యన్ తన థర్డ్ అటెంప్ట్ గా భారీ ప్లానింగ్ లో ఉన్నాడట.. సో.. తనదగ్గర ఉన్న స్టోరీకి యంగ్ టైగర్ అయితే పెర్‌ఫెక్ట్‌గా జస్టిస్ చేస్తాడన్న నమ్మకంతో.. జూనియర్‌ని కలిసి కథ వినిపించాడట.. అయితే.. ఇప్పుడున్న బిజీలో తారక్ తారక్ ఈ సినిమాకు డేట్స్ ఇవ్వాలంటే ఎలా లేదన్నా సరే 3 ఏళ్లు వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి.. రాహుల్ సంకృత్యన్ ఏం చేస్తాడు అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
దేవర (Devara) మూవీని రెండు భాగాలుగా తీస్తున్నారు. సో ఇప్పుడు ఈ సినిమా కోసం రెండు భాగాల కోసం ఎన్టీఆర్ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు.. వార్-2 (War-2) షూటింగ్ కోసం కూడా జూనియర్ డేట్స్ అడ్జస్ట్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ (Prashant Neil) సినిమా కూడా తారక్ చేతిలో ఉంది. ఈ సినిమాలన్నీ పూర్తి చేయాలంటే ఎలా లేదన్నా 3 ఏళ్ల దాకా టైం పడుతుంది. మరి అప్పటివరకు రాహుల్ సంకృత్యన్ వెయిట్ చేస్తాడా అన్నది ఇప్పుడు డౌట్‌గా మారింది. తారక్ కోసమే అన్నేళ్లు వెయిట్ చేయడం కష్టం కాబట్టి కచ్చితంగా రాహుల్ మరో కథతో వేరే హీరోతో సినిమా చేసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి రాహుల్ ఎన్టీఆర్ ఈ కాంబో తెర మీద చూసే అవకాశం ఉంటుందా లేదా అన్నది చూడాలి.