Mad : మ్యాడ్ మ్యాక్స్ మరో బంగారు బాతు కానుందా..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. ఇక‌.. ఇక సీక్వెల్స్ కూడా ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్లు అవుతూ నిర్మాత‌ల‌కు బంగారు బాతుల్లా మారుతున్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. ఇక‌.. ఇక సీక్వెల్స్ కూడా ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్లు అవుతూ నిర్మాత‌ల‌కు బంగారు బాతుల్లా మారుతున్నాయి. దీంతో.. చిన్న సినిమాలు కూడా స్వీక్వెల్ల బాట ప‌డుతున్నాయి. డీజే టిల్లుకు సీక్వెల్ గా రిలీజైన టిల్లు స్క్వేర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ భారీ వసూళ్లను రాబ‌డుతుండ‌గా.. ఇప్పుడు మ‌రో సినిమా కూడా సీక్వెల్ బాట ప‌ట్టింది. గ‌త ఏడాది రిలైజ్ సూప‌ర్ హిట్ అయిన మ్యాడ్ మూవీకి సీక్వెల్‌ని మేక‌ర్స్ క‌న్ఫ‌ర్మ్ చేయ‌గా.. ఈ ఏప్రిల్ నుంచే షూటింగ్‌కి స‌న్నాహాలు చేస్త్తున్నారు.

మరి ఈ అవైటెడ్ సీక్వెల్ కి ఇపుడు ఇంట్రెస్టింగ్ టైటిల్ లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. దీని ప్రకారం పార్ట్ 2 ని “మ్యాడ్ మ్యాక్స్” గా మేకర్స్ తీసుకురాబోతున్నారట. గత ఏడాది రిలీజైన మ్యాడ్ మూవీ సెన్సేష‌న్ క్రియేట్ చేసింద‌నే చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి సూపర్ సక్సెస్ సాధించింది. 2023లో విడుదలైన చిన్న సినిమాల్లో సూపర్ హిట్ అయిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఈ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయమయ్యారు. ఆయనతోపాటు సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా యాక్ట్ చేశారు. క్యాస్టింగ్ ని మార్చకుండా మొత్తం అదే తారాగణంతో మ్యాడ్ మాక్స్ ని రూపొందిస్తారట.. టిల్లు తరహాలో ఇందులో ఊహించని ట్విస్టులు, థ్రిల్స్ చాలానే పెడతారని వినికిడి. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. మ్యాడ్ త‌ర‌హాలో మ్యాడ్ మ్యాక్స్ కూడా మరో బంగారు బాతు అవుతుందని ఇన్ సైడ్ టాక్..