పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌కు ట్రిపులార్ సినిమాతో రాచ్ చరణ్‌కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. బన్నీ ఇండియా వైడ్‌గా ఫేమస్ అయితే.. చెర్రీ మాత్రం ఎక్రాస్ ది గ్లోబ్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇంత క్రేజ్ వచ్చాక ప్రొడ్యూసర్స్ ఊరుకుంటారా. తమ సినిమాలో వీళ్లు చిన్న గెస్ట్ రోల్ చేసినా ఒకే అన్నట్టు వెంట పడుతూనే ఉంటారు. రెమ్యునరేషన్ ఎంతైనా సరే.. సినిమాలో స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అనుకుంటారు.
ఇప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్ వెనక కూడా అలాగే పడుతున్నారు. అట్లీ డైరెక్షన్‌లో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జవాన్‌లో అల్లు అర్జున్ గెస్ట్ రోల్ చేయాల్సిందిగా సినిమా నిర్మాతలు అడిగారట. ఈ విషయంలో కొంత కాలం సస్పెన్స్ కూడా కొనసాగింది. బన్నీ ఈ క్యారెక్టర్‌కు ఓకే చెప్పేశారు అనే గాసిప్స్ కూడా వచ్చాయి. అయితే నిజానికి ఈ రోల్ చేసేందుకు బన్నీ నో చెప్పారు. స్టోరీ బాగుందని చెప్తూనే చాలా సున్నితంగా ఆఫర్‌ను తిరస్కరించారట. దీంతో ప్రొడ్యూసర్స్‌కు నిరాశే మిగిలింది.
అయితే.. ఇప్పుడు ఇదే క్యారెక్టర్‌లో రామ్ చరణ్‌ను సెట్ చేసేందుకు జవాన్ మూవీ మేకర్స్ ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఈ విషయంలో రామ్ చరణ్‌ను ప్రొడ్యూసర్స్ కలిసినట్టు తెలుస్తోంది. సినిమాలో 15 నిమిషాలు ఉండే క్యారెక్టర్ గురించి రామ్ చరణ్‌కు దర్శక నిర్మాతలు వివరించినట్టుగా సమాచారం. అయితే చెర్రీ మనసులో ఏముంది అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఈ క్యారెక్టర్ చేసేందుకు రామ్ చరణ్ ఓకే చెప్తారా లేదా అని ఫ్యాన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులు లైన్‌లో ఉండటం.. మరోపక్క బన్నీ ఈ ఆఫర్‌ను పక్కన పెట్టడంతో చరణ్ కూడా జవాన్‌లో గెస్ట్ చేయడం కష్టమంటున్నారు విశ్లేషకులు. అయితే చెర్రీ ఏం డెసిషన్ తీసుకుంటాడో చూడాలి మరి.