Samantha : క్యామియో రోల్‌లో స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌నుందా..?

ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) మోస్ట్ అవైటింగ్ మూవీ పుష్ప‌-2.. ప్యాన్ ఇండియా లెవెల్‌లో బ‌న్నీ ఫ్యాన్స్ ఎంతో ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ బ‌జ్ ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) మోస్ట్ అవైటింగ్ మూవీ పుష్ప‌-2.. ప్యాన్ ఇండియా లెవెల్‌లో బ‌న్నీ ఫ్యాన్స్ ఎంతో ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ బ‌జ్ ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. పుష్ప మూవీలో ఊ అంటావా ఉఊ అంటావా అంటూ చిందులేసి కుర్ర‌కారుకు కంటి మీద కునుకు లేకుండా చేసిన చెన్నై చిన్న‌ది స‌మంత‌.. పుష్ప‌-2లోనూ క‌నువిందు చేయ‌నుంద‌ట‌.. పార్ట్ -1 లోలాగా కేవ‌లం ఐటం సాంగ్‌కే ప‌రిమితం కాకుండా.. సామ్ ఓ స్పెష‌ల్ రోల్‌లో క‌నిపించ‌నుంద‌న్న న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

అల్లు అర్జున్-సుకుమార్ (Allu Arjun-Sukumar) కాంబోలో ఎంతో ప్రెస్టేజీయ‌స్‌గా తెరకెక్కుతున్న ‘పుష్ప ది రూల్’ మూవీలో ఎంతో మంది స్టార్లు భాగం అవుతున్నారు. ముఖ్యంగా చాలా మంది నేషనల్ క్రేజ్ ఉన్న ప్రముఖులను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘పుష్ప 2’ (Pushpa 2) కోసం టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ సమంత ను ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారని లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో సమంత క్యామియో రోల్ లో నటించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

పుష్ఫ ఫ‌స్ట్ పార్ట్‌లో స‌మంత చేసిన స్పెష‌ల్ సాంగ్ వెనుక ఓ కథ ఉంటుందట. దాన్ని ‘పుష్ప ది రూల్’ లో చూపించబోతున్నారని, ఆ ట్విస్ట్ వచ్చినప్పుడు సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు ఆడియెన్స్‌కు కూడా మైండ్ బ్లాక్ అయిపోతుందని అంటున్నారు. దీంతో సమంత రోల్‌పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోతోన్నాయి. అంతేకాదు.. ఇక్క‌డ ఇంకో క్రేజీ టాక్ ఏంటంటే.. పుష్ప మూడో పార్ట్ లోనూ సమంత రోల్ కు మంచి స్కోప్ ఉందంటున్నారు. నిజంగా ఈ వార్తే నిజ‌మైతే.. సామ్ ఫ్యాన్స్‌కి ఈ మూవీలో ఫుల్ మీల్ప్ ఖాయ‌మంటున్నారు. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి వీటిలో నిజమెంతో తెలియాలంటే మ‌రికొంత కాలం వేచి చూడాల్సిందే..