Tollywood Movies:సెప్టెంబర్ లో పండగే పండగ..!

ఆగస్ట్ లో చిన్న సినిమాలొచ్చాయి, జైలర్, భోళాశంకర్ లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి . కానీ ఇప్పుడు అందరి చూపు సెప్టెంబర్ పై పడింది. వారానికో ప్రామిసింగ్ మూవీ రిలీజ్ కాబోతోంది. ప్రతి ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉండటంతో పాన్ ఇండియా ఫెస్టివల్ లో ఎవరు సత్తా చాటుతారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

  • Written By:
  • Publish Date - August 18, 2023 / 07:15 AM IST

సెప్టెంబర్ లో పాన్ ఇండియా ఫెస్టివల్ జరగబోతుంది. 4,5 రోజుల గ్యాప్ లో అరడజన్ కి పైగా సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఇందులో మొదటిగా విజయ్ ఖుషి మూవీ థియేటర్స్ లో దిగబోతోంది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ కి శివ నిర్వాణ డైరెక్టర్. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ పెద్ద హిట్ . ట్రైలర్ కూడా భారీ అంచనాలు క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 1న ఈ మూవీ సౌత్ తో పాటు నార్త్ లో సందడి చేయనుంది.

ఖుషి వచ్చిన వారం రోజులకే, అంటే సెప్టెంబర్ 7న ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ బాక్సాఫీస్ బరిలో దిగబోతోంది. పి.మహేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో మాత్రమే రిలీజ్ కానుంది. లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నుంచి వస్తున్న మూవీ కావడం భారీ హైప్ ఉంది.ఇక . అఖండతో హిట్ కొట్టిన బోయపాటి ఇప్పుడు రామ్ తో స్కంద మూవీ చేస్తున్నాడు.సెప్టెంబర్ 15న ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.ఇందులో శ్రీలీల ఉండటంతో ట్రేడ్ లో జోరుగా బెట్టింగ్ జరుగుతోంది.

సెప్టెంబర్ బాక్సాఫీస్ కు ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సలార్ సెప్టెంబర్ 28న ఇండియాతో పాటు ఇంగ్లీష్ ,జపాన్ లాంగ్వేజ్స్ లో రిలీజ్ కానుంది.టీజర్ దెబ్బకి అంచనాలు ఆకాశాన్నంటాయి.అలాగే ఈ సినిమాకి పోటీ ఇచ్చేందుకు బాలీవుడ్ నుంచి ది వ్యాక్సిన్ వార్ రిలీజ్ అవుతోంది.

సెప్టెంబర్ లో ఇతర భాషల్లో కూడా పలు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.వాటిలో షారుఖ్ జవాన్ సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతుంటే…రాఘవ లారెన్స్ చంద్రముఖి2, విశాల్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ మార్క్ ఆంటోని సెప్టెంబర్ 15న ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. మొత్తానికి సెప్టెంబర్ లో పాన్ ఇండియా సినిమాల ఫెస్టివల్ పీక్స్ లో జరగబోతోంది. వారానికో పెద్ద సినిమా వస్తోంది. ప్రతి దానిపై భారీ అంచనాలున్నాయి. మరి వీటిలో ఏ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందో..ఏ ప్రాజెక్ట్ నెషనల్ వైడ్ గా కలక్షన్స్ వర్షం కురిపిస్తుందో చూడాలి.