వాహ్ జాకీర్, 19 ఏళ్ళకే అమెరికాలో డాక్టరేట్, జాకీర్ హుస్సేన్ బ్యాక్ గ్రౌండ్ వేరే లెవెల్

ప్రముఖ వాయిద్య కారుడు జాకీర్ హుస్సేన్ అమెరికాలో అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచారు. 1951 మార్చి 9 ముంబైలోని మహిమాలో తబలా విధ్వంసుడు అల్లా రక, బావి బేగం దంపతులకు జన్మించిన జాకీర్ హుస్సేన్ వాయిద్యానికి అమెరికా సైతం ఫిదా అయిపోయింది.

  • Written By:
  • Publish Date - December 16, 2024 / 09:34 PM IST

ప్రముఖ వాయిద్య కారుడు జాకీర్ హుస్సేన్ అమెరికాలో అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచారు. 1951 మార్చి 9 ముంబైలోని మహిమాలో తబలా విధ్వంసుడు అల్లా రక, బావి బేగం దంపతులకు జన్మించిన జాకీర్ హుస్సేన్ వాయిద్యానికి అమెరికా సైతం ఫిదా అయిపోయింది. భారత్ తో సమానంగా అమెరికాలో కూడా జాకీర్ హుస్సేన్ ప్రదర్శనలు ఇవ్వడం అప్పట్లో ఒక సంచలనం. ఏ విదేశీ సంగీత స్వరకర్తకులేని డిమాండ్ అమెరికాలో జాకీర్ హుస్సేన్ కు ఉందంటే అమెరికాలో ఆయనకు ఉన్న క్రేజ్ ఏ రేంజ్ లో ఉండేదో చెప్పవచ్చు.

మూడేళ్ల వయసు నుంచే వాయిద్యాన్ని నేర్చుకున్న జాకీర్ హుస్సేన్ 11 ఏళ్ళకే అమెరికాలో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్లడం అప్పట్లో ఒక సంచలనంగా చెప్తారు. ఇండియన్ మ్యూజిక్ కూడా అప్పటి నుంచే వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయింది. 1969 లో అంటే సరిగ్గా అతను పుట్టిన 11 ఏళ్ళకు వాషింగ్టన్ యూనివర్సిటీలో సంగీతంలో డాక్టరేట్ తీసుకోవడానికి వెళ్లడం అంతర్జాతీయంగా సంచలనమైంది. ఆ తర్వాత అంతర్జాతీయంగా దాదాపు 150 వరకు ప్రదర్శనలు ఇచ్చారు జాకీర్ హుస్సేన్. 1991లో విడుదలైన జాకీర్ హుస్సేన్ ఆల్బమ్ కు అమెరికా షేక్ అయింది.

1992లో బెస్ట్ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్ గా గ్రామీ అవార్డు కూడా అందుకుంది జాకీర్ హుస్సేన్ ఆల్బమ్. వరల్డ్ మ్యూజిక్ విభాగంలో ఆ అవార్డును మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. అదే ఏడాది జాకీర్ హుస్సేన్ గెలుచుకోవడం అప్పట్లో ఒక సెన్సేషన్. ఇక జాకీర్ హుస్సేన్ ఆంటోని అనే అమ్మాయిని అమెరికాలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె అతనికి మేనేజర్ గా కూడా వ్యవహరించింది. ఇక ఆయన కూతుళ్లు కూడా ఎక్కువగా అమెరికాలోనే ఉండేవారు. పెద్ద కూతురు మారితే కనీస… లాస్ ఏంజెల్స్ లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి గ్రాడ్యుయేట్ తీసుకున్నారు.

జాకీర్ ప్రిన్సిపాల్ యూనివర్సిటీలో మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో 2005 నుంచి 2006 మధ్యలో కంప్లీట్ ప్రొఫెసర్ గా పని చేశారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్ గా కూడా ఆయన పనిచేయడం గమనార్హం. ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలో నివాసం ఉంటున్న జాకీర్ హుస్సేన్… ఆదివారం ఉదయం అమెరికా కాలమానం ప్రకారం తుది శ్వాస విడిచారు. ఇటు జాకీర్ హుస్సేన్ కు మన తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. 90 లో ఆయన సంగీతం దేశాన్ని ఉపేసింది. ఎన్నో ప్రముఖ కార్యక్రమాల్లో ఆయన తబలా వాయించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజ్ మహల్ టీ కోసం ఆయన చేసిన ఒక యాడ్ ఇప్పటికీ సెన్సేషన్.