YASH 19: పవర్‌ఫుల్‌ టైటిల్‌.. ‘టాక్సిక్‌’ మరో సెన్సేషన్‌కి రెడీ అయిన యశ్‌!

కెజిఎఫ్‌ 2 తర్వాత మంచి కథ కోసం ఎంతో గ్యాప్‌ తీసుకున్న యశ్‌ ఫైనల్‌గా గీతు కథతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ కోసం యశ్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు డిసెంబర్‌ 8న యశ్‌ కొత్త సినిమా టైటిల్‌ను ఎనౌన్స్‌ చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.

  • Written By:
  • Publish Date - December 8, 2023 / 02:53 PM IST

YASH 19: కెజిఎఫ్‌ చాప్టర్‌ 1, కెజిఎఫ్‌ చాప్టర్‌ 2 వంటి బ్లాక్‌బస్టర్స్‌తో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన యశ్‌ తర్వాత చేయబోయే సినిమాపైనే అందరి దృష్టీ ఉంది. 2018లో కెజిఎఫ్‌1 రిలీజ్‌ కాగా, 2022 ఏప్రిల్‌లో కెజిఎఫ్‌ 2 విడుదలైంది. ఈ సినిమా విడుదలై ఏడాదిన్నర కావస్తున్నా యశ్‌ తదుపరి సినిమాపై ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అయితే ఇటీవల తన 19వ సినిమాను గీతు మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

Extra Ordinary Man Review: నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ హిట్ కొట్టినట్టేనా..!

నటిగా, దర్శకురాలిగా ఎన్నో అవార్డులు అందుకున్న గీతు మోహన్‌ దాస్‌ 2014లో హిందీలో రూపొందించిన లియర్స్‌ డైస్‌ చిత్రాన్ని ఇండియా తరఫున ఆస్కార్‌కు పంపారు. అయితే ఈ సినిమా ఆస్కార్‌కు నామినేట్‌ అవ్వలేదు. కెజిఎఫ్‌ 2 తర్వాత మంచి కథ కోసం ఎంతో గ్యాప్‌ తీసుకున్న యశ్‌ ఫైనల్‌గా గీతు కథతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ కోసం యశ్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు డిసెంబర్‌ 8న యశ్‌ కొత్త సినిమా టైటిల్‌ను ఎనౌన్స్‌ చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘టాక్సిక్‌’ పేరుతో ఈ సినిమా రూపొందనుంది. ఏప్రిల్‌ 10, 2025లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు రిలీజ్‌ డేట్‌ను కూడా ఎనౌన్స్‌ చేశారు. ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌ అన్న ట్యాగ్‌ లైన్‌ కూడా టైటిల్‌కి యాడ్‌ చేశారు. ఇది టైటిల్‌ అనౌన్స్‌మెంటే అయినప్పటికీ ఆ వీడియోలో యశ్‌ లుక్‌ను కూడా రివీల్‌ చేశారు.

టాక్సిక్‌ పేరు బ్యాక్‌గ్రౌండ్‌లో తుపాకీతో యశ్‌ కనిపించారు. ఈ చిత్రాన్ని కేవీన్‌ఎన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. ఈ మూవీ తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. కానీ ఈ సినిమాలో హీరోయిన్‌తో పాటు ఇతర వివరాలను మేకర్స్‌ వెల్లడిరచలేదు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళబోతోంది.