YASH: యష్ ఏమైపోయాడు..? కొత్త ప్రాజెక్టు ఎందుకు స్టార్ట్ కాలేదు..?

కేజీఎఫ్ సిరీస్‌తో ఓవర్ నైట్‌లో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు యష్. సింగిల్ సినిమాతో నేషనల్ వైడ్‌గా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఈ ఫీట్ అందుకున్న ఏకైక స్టార్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. కానీ కేజీఎఫ్2 రిలీజై ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు.

  • Written By:
  • Publish Date - September 13, 2023 / 04:11 PM IST

YASH: ఒక్క హిట్ హీరో కెరీర్‌ని మార్చేస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌కి కమిట్ అయ్యేలా చేస్తుంది. ఇక పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటితే నేషనల్ వైడ్‌గా మార్కెట్ క్రియేట్ అవుతుంది. తన కెరీర్ పీక్స్‌కి చేరుతుంది. కానీ ఈ విషయంలో సైలెంట్ అయ్యాడు ఓ స్టార్ హీరో. పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ కొట్టి ఏడాదిన్నర అయినా ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేయలేదు. కేజీఎఫ్ సిరీస్‌తో ఓవర్ నైట్‌లో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు యష్. సింగిల్ సినిమాతో నేషనల్ వైడ్‌గా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు.

కన్నడ ఇండస్ట్రీ నుంచి ఈ ఫీట్ అందుకున్న ఏకైక స్టార్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. కానీ కేజీఎఫ్2 రిలీజై ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. అసలు ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. అల్లు అరవింద్ తీస్తున్న రామాయణం సిరీస్‌లో రావణుడి పాత్రకి యష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌తో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాట్లు కామెంట్స్ వచ్చాయి. అది కూడా ఫైనల్ కాలేదు. ఇక నర్తన్ దర్శకత్వంలో యష్ మూవీ అంటూ ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో యష్ నెక్స్ట్ సినిమా గురించి వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. నిజానికి కేజీఎఫ్ సిరీస్‌కి ముందు యష్ తన సినిమాల విషయంలో ఎప్పుడూ ఇంత గ్యాప్ తీసుకోలేదు.

ఒక సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే రెండు, మూడు కథలను లైన్‌లో పెట్టేవాడు. కానీ కేజీఎఫ్ 2 తర్వాత యష్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకే నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ కచ్చితంగా కేజీఎఫ్ సిరీస్‌ కి మించి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే టైం కాస్త ఎక్కువైనా ఆచితూచి కథల్ని ఎంపిక చేసుకుంటున్నాడట. అన్నీ కుదిరితే ఈ ఏడాది డిసెంబర్‌లో తన కొత్త ప్రాజెక్ట్‌పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు శాండల్‌వుడ్ క్రిటిక్స్.