Pawan Kalyan: యాత్ర2కు పోటీగా రాంబాబు.. ఏపీలో పోటా పోటీగా సినిమాలు

పవన్ కల్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా కూడా ఇప్పుడే రీరిలీజ్ అవుతోంది. అది కూడా యాత్ర2 మూవీ కంటే ఒక్కరోజు ముందు ఫిబ్రవరి 7 నాడు. దాంతో ఏ సినిమా హిట్టవుతుంది.. ఏది ఫట్టవుతుంది.

  • Written By:
  • Publish Date - February 1, 2024 / 12:49 PM IST

Pawan Kalyan: ఏపీలో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ సినిమాల చుట్టూ తిరుగుతున్నాయి. జగన్ పాదయాత్ర, ఆయన ఎదుర్కొన్న సవాళ్ళతో తీసిన యాత్ర 2 మూవీ ఈనెల 8న రిలీజ్ అవుతోంది. అయితే ప్రస్తుత రాజకీయ నేతల బండారాన్ని బయటపెట్టే జర్నలిస్ట్ పాత్రలో పవన్ కల్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా కూడా ఇప్పుడే రీరిలీజ్ అవుతోంది. అది కూడా యాత్ర2 మూవీ కంటే ఒక్కరోజు ముందు ఫిబ్రవరి 7 నాడు. దాంతో ఏ సినిమా హిట్టవుతుంది.. ఏది ఫట్టవుతుంది.. ఏపీ జనం ఎక్కువమంది ఎవరి సినిమాను చూస్తారు..? ఏ మూవీకి ఎక్కువ కలెక్షన్లు వస్తాయి?

Telangana BJP : తెలంగాణలో స్పీడ్ పెంచిన కమలం పార్టీ

అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ సీఎం, YCP అధినేత జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన సినిమా యాత్ర 2. వైఎస్ మరణం దగ్గర నుంచి.. జగన్ సీఎం అయ్యే దాకా ఏపీలో జరిగిన పరిణామాలు ఇందులో ఉన్నాయి. తండ్రీ కొడుకుల కథగా దర్శకుడు మహి వి రాఘవ్ ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈమధ్యే ఆర్జీవీ తీసిన వ్యూహం ఇంకా థియేటర్ల ముందుకు రాలేదు. దాంతో యాత్ర2.. ఏపీ ఎన్నికల్లో జగన్‌కి కలిసొస్తుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. యాత్ర2కి సరిగ్గా ఒక్కరోజు ముందు ఫిబ్రవరి 7న.. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ మూవీ రీరిలీజ్ అవుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుత రాజకీయాలపై విమర్శలతో తీసిన మూవీ ఇది. బయటకు జనం ముందు ఒక లాగా.. లోపల మరోలాగా ఉండే పొలిటికల్ లీడర్ల బండారాన్ని బయటపెట్టే పాత్రలో జర్నలిస్టుగా పవన్ కళ్యాణ్ నటించారు. నిర్మాత నట్టికుమార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో దీన్ని రీరిలీజ్ చేస్తున్నారు. నిజానికి ఈమధ్యకాలంలో రీరిలీజ్ ట్రెండ్ పెరిగింది. అయితే ఏపీ ఎన్నికల ముందు.. పొలిటికల్ సెటైర్ మూవీగా పవన్ కల్యాణ్ నటించిన ఈ సినిమా రిలీజ్ అవడమే ఇక్కడ స్పెషాలిటీ.

జగన్ సినిమాకి పోటీగా రాంబాబు మూవీ వస్తుండటంతో రెండు సినిమాల మధ్య పోటీ కనిపిస్తోంది. ఏపీ ఎన్నికలకు ఇంకా టైమ్ ఉంది. అయినప్పటికీ.. ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో, ఏపీ ప్రజల్లో ఎక్కువ మంది దేన్ని ఆదరిస్తే.. ఆ లీడర్‌కు అక్కడ సపోర్ట్ ఉన్నట్టు అనుకోవచ్చా. 7న రీ రిలీజ్ అయ్యే ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ మూవీకి ఎక్కువ ఓపెనింగ్స్ వస్తాయా? 8న వస్తున్న యాత్ర 2కు వస్తాయా? అన్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. ఇంకో మాట చెప్పాలంటే.. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ముందు యాత్ర 2లో నటించిన హీరో జీవా ఇమేజ్ చాలా తక్కువ. కానీ ఇక్కడ పవన్ వర్సెస్ జగన్‌గా జనం చూస్తున్నారు. ఇంతకు ముందు రీరిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ రికార్డ్ ఓపెనింగ్స్ సాధించాయి. మరి కెమెరామెన్ గంగతో రాంబాబుకి కూడా అంతకంటే ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయా..? పవన్ కొత్త మూవీస్ రిలీజ్ అయితే ఏపీలో థియేటర్లలో అధికారులు తనిఖీలు చేపట్టేవారు. ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తారా..? లేదంటే వదిలేస్తారా..? ఏపీ ఎన్నికల హడావిడి ఉంది కాబట్టి అధికారులు పట్టించుకునే అవకాశం ఉండకపోవచ్చనే అనుకుంటున్నారు.