Bigg Boss 7 : చరిత్ర సృష్టించిన యావర్.. బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ కంటెస్టెంట్‌గా రికార్డు..

బిగ్ బాస్ ఎవిక్షన్ పాస్ కోసం ఇంటి సభ్యుల్ని నానా తిప్పలు పెడుతున్నాడు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్‌లో అర్జున్ ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు. అయితే అది అక్కడితో అయిపోలేదు.. నేటి 75వ ఎపిసోడ్‌లో కూడా కంటిన్యూ అయ్యింది. ఈ ఎపిసోడ్స్ హైలైట్స్ ఏంటంటే.. శివాజీ ఇంట్లో వాళ్లందరితో బెస్ట్ కెప్టెన్ అనిపించుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు.

బిగ్ బాస్ ఎవిక్షన్ పాస్ కోసం ఇంటి సభ్యుల్ని నానా తిప్పలు పెడుతున్నాడు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్‌లో అర్జున్ ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు. అయితే అది అక్కడితో అయిపోలేదు.. నేటి 75వ ఎపిసోడ్‌లో కూడా కంటిన్యూ అయ్యింది. ఈ ఎపిసోడ్స్ హైలైట్స్ ఏంటంటే.. శివాజీ ఇంట్లో వాళ్లందరితో బెస్ట్ కెప్టెన్ అనిపించుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్నటి వరకూ అసలు కిచెన్ దరిదాపుల్లో కనిపించేవాడు కాదు కానీ.. కెప్టెన్ అయిన తరువాత దగ్గరుండి మరీ అన్నీ చూసుకుంటున్నాడు. పైగా దగ్గరుండి గారెలు వేయించాడు. వంట విషయంలో రతిక, అశ్విని శివాజీ తీరుపై కామెంట్స్ చేసుకున్నారు. ప్రశాంత్, అశ్విని సరదాగా మాట్లాడుకుంటున్నారు. తర్వాత బిగ్ బాస్ ఎవిక్షన్ పాస్ సంపాదించుకునేందుకు టాస్క్ ఇచ్చాడు.

బిగ్ బాస్ ఇచ్చిన మొదటి టాస్క్ లో అర్జున్, యావర్ పోటిగా పడ్డారు. చివరకు యావర్ విన్నర్ గా నిలిచాడు. తర్వాత బిగ్ బాస్ బాలల దినోత్సవం సందర్భంగా టాస్క్ ఇవ్వగా ఇంటి సభ్యులు చిన్న పిల్లలుగా మారిపోయి సందడి చేశారు. ఆ తరువాత జరిగిన స్కూటర్ సవారీ టాస్క్ లో ప్రశాంత్ యావర్ పోటి పడగా.. యావర్ విన్నర్ గా నిలిచాడు. ఆ తరువాతి టాస్క్‌లో బర్గర్లు తినే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అందులో భాగంగా డైస్‌ను రోల్ చేసి బర్గర్ ఫోటో వచ్చినప్పుడల్లా బర్గర్లను తింటూ ఉండాలని బిగ్ బాస్ ఛాలెంజ్ ఇచ్చాడు.. ఈ టాస్క్‌లో శోభాశెట్టి, యావర్ పోటి పడగా.. యావర్ విన్నర్ గా నిలిచాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ టాస్కులు గెలిచిన యావర్.. చివరిగా ప్రియాంక, శివాజీలతో పోటీపడ్డాడు.

విల్లుపై బాల్స్‌ను బ్యాలెన్స్ చేయాలని శివాజీ, ప్రియాంక, యావర్‌లకు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. సంచాలకులుగా శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ ఉండాలని ఆదేశించారు. ఈ టాస్క్ లో విల్లును ఎక్కువ సేపు పట్టుకున్న యావర్ విన్నర్ గానిలిచాచాడు. అయితే ఓటమిని శివాజీ డైజెస్ట్ చేసుకోలేదు. ఆడుతుంటే డిస్టర్బ్ చేశాడని రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌పై ఆగ్రహాం వ్యక్తం చేశాడు. నీ గేమ్ ఆడాలి అన్న కానీ వినలే.. ఆటలో ఎవరు గెలిచారని బిగ్ బాస్ ఆడగగా.. శోభ చెప్పడం ప్రారంభించగా శివాజీ కి కోపం వచ్చింది. మీరు ఇలా మాట్లాడొద్దు అని శోభ అనే సరికి.. నీ కన్నా పెద్దగా అరుస్తా.. ఎందుకు అరుస్తున్నావ్.. అరవలేనా.. అంటూ ఆమె మీదకు వచ్చాడు. దీంతో ఇంటి సభ్యులు షాక్ అయ్యారు. మొత్తానికి యావర్ బిగ్ బాస్ లో వరుసగా నిర్వహించిన ఎవిక్షన్ పాస్ టాస్క్ లో విన్నర్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు