యంగ్ రెబల్ స్టార్ (Young Rebel Star) ప్రభాస్ (Prabhas) ఓ వెపన్ లాంటోడు… ఆ ఆయుధాన్ని వాడాల్సిన విధంగా వాడితే.. ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ప్రభాస్ కటౌట్‌కు తగ్గ కథ పడితే చాలు.. రికార్డుల సునామీ సృష్టిస్తాడు. అందుకే.. బాహుబలి తర్వాత పాన్ ఇండియాలో ప్రభాస్ క్రేజ్ స్కై హైట్‌కి తాకింది. మధ్యలో సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి సినిమాలు గురి తప్పినా.. డార్లింగ్ (Darling) క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు సరికదా.. రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇక.. ఇటీవల రిలీజ్ అయిన సలార్.. బాక్సాఫీస్ వద్ద ఏడువందల కోట్ల వసూళ్లతో డైనోసార్ లాంటి విధ్వంసం సృష్టించింది.. ఇక.. సలార్ -2..కల్కి..స్పిరిట్ లాంటి చిత్రాలు డార్లింగ్ రేంజ్ ని అంతకంతకు రెట్టింపు చేస్తాయనే అంచనాలు బలంగా ఉన్నాయి.. దీంతో.. ప్రభాస్ పేరు మీద రానున్న ప్రాజెక్టుల్లో వేల కోట్ల బిజినెస్ నడవనుంది.
మరి.. ఇండియన్ సినిమాలో డైనోసార్ రేంజ్ క్రేజ్‌తో బలంగా పాతుకుపోయిన ప్రభాస్ కటౌట్‌ను టచ్ చేయగలిగే హీరో ఎవరు అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.. ప్రభాస్ ని వెనక్కి నెట్టే స్టార్ ఎవరు? ప్రభాస్ రేంజ్‌ను, క్రేజ్‌ను వెనక్కి నెట్టే సత్తా ఎవరికుంది? ఆయనతో సరిసమానంగా పోటీగా నిలిచేది ఎవరు? అంటూ కొంత మంది హీరోల పేర్లపై డిస్కషన్ నడుస్తోంది.. రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీలలో ప్రభాస్‌కు ఎదురొచ్చే హీరో ఎవరన్నదానిపై సోషల్ మీడియాలో వేడి వేడిగా చర్చ నడుస్తోంది.
రామ్ చరణ్..ఎన్టీఆర్ ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండి యా మార్కెట్ లోకి అడుగు పెట్టారు. ఇద్దరు కలిసి నటించిన ఆ సినిమా 1300 కోట్ల వసూళ్లని రాబట్టింది. ఈ మూవీతో ఇద్దరూ గ్లోబల్ స్టార్స్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. త్వరలో ఎవరికి వారు సోలోగా పాన్ ఇండియాని షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ రెండు సినిమాల డైరెక్టర్లు కూడా పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్లే కాబట్టి.. బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. అలాగే పుష్ప`తో ఐకాన్ స్టార్ (Icon star) అల్లు అర్జున్ (Allu Arjun) కూడా పాన్ ఇండియా రేసులోకి దూసుకొచ్చాడు. పుష్ప-2 గురించి వరల్డ్ వైడ్‌గా కూడా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. `పుష్ప-2 తో బన్నీ పాన్ ఇండియా మార్కెట్ రెట్టింపు అవుతుంది అన్న అంచనాలు బలంగా ఉన్నాయి.
ప్రస్తుతానికి ఈ ముగ్గురు హీరోలకు మాత్రమే ప్రభాస్‌ను పాన్ ఇండియా మార్కెట్ లో ఎదుర్కొనే సత్తా ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే.. పాన్ ఇండియా లెవల్‌లో డార్లింగ్‌కు ఉన్న క్రేజ్‌ను, రేంజ్‌ను టచ్ చేయడం అంత ఈజీ కాదంటున్నారు డై హార్ట్ ఫ్యాన్స్.. హిట్టు, ప్లాపులతో ప్రభాస్ క్రేజ్‌కు సంబంధం లేదంటున్నారు. మరి.. చెర్రీ, జూనియర్, బన్నీల ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..? ఎలాంటి సినిమాలను సెలక్ట్ చేసుకుంటున్నారు. ఏ రేంజ్‌లో ప్రేక్షకులను అలరించబోతున్నారు అన్నదానిపై మిగతా లెక్కలు తేలబోతున్నాయి. డార్లింగ్ మాత్రం కల్కీ…సలార్-2 (Salaar -2) ..స్పిరిట్ అంటూ సంచలన చిత్రాలతోనే ముందుకు రాబోతున్నాడు. చూడాలి మరి 2024లో ఏం జరగబోతోందో..