Kriti Sanon: జాతీయ ఉత్తమనటి అవార్డు తీసుకున్న ఆనందం కృతిసనన్‌కు ఆవిరైపోయింది. మిమి మూవీతో కృతి.. గంగూభాయ్‌తో అలియాభట్ నేషనల్ బెస్ట్ యాక్టర్స్‌గా ఎంపికయ్యారు. అయితే, ఈ ఆనందాన్ని ఎవరు చెరిపేశారో తెలిస్తే షాకవుతారు. అందంతోపాటు.. కాస్తో గొప్పో అభినయం కూడా వుండాలి. ఎంత గ్లామర్ ఒలకబోసినా యాక్టింగ్ స్కిల్స్ లేకపోతే కష్టమే. ఈ సత్యాన్ని లేటుగా తెలుసుకున్న కృతి సనన్.. పానిపట్టు, మిమి సినిమాల్లో పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నా.. దురదృష్టం వెంటాడడంతో ఫ్లాపులే మిగిలాయి.
మిమి తర్వాత కృతి ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టింది. 201 లో వచ్చిన అర్జున్ పాటియాలాతో ఫెయిల్యూర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత పానిపట్, బచ్చన్ పాండే, బెడియా, షెహజాదా, ఆదిపురుష్ వీటితో పాటుగా రీసెంట్ రిలీజ్ అయిన గణపత్ సినిమా కూడా డిజాస్టర్ కా బాప్ అనిపించుకుంది. దీతో కృతిసనన్‌పై మొదట్నుంచీ ఐరెన్‌లెగ్ ముద్ర పడినా.. మీడియా ఫోకస్‌తో క్రేజీ హీరోయిన్‌గా చెలామణి అవుతూ వచ్చింది. ఎప్పడికప్పుడు లవ్ ఎఫైర్స్‌తో.. గ్లామర్ షోస్‌తో మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మీడియాలో తప్ప బైట క్రేజ్ లేకుండానే కెరీర్ నడిచిపోయింది. కృతి నేనొక్కడినే మూవీతో వెండితెరకు పరిచయమైంది. మహేశ్ హైట్‌కు తగ్గట్టు సరిజోడిగా కనిపించిందేగానీ తెలుగు ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయలేకపోయింది.
హీరోపంటి మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి.. షారూక్ దిల్‌వాలేలో చోటు సంపాదించింది. ఫ్లాపులు వచ్చినా.. ఆఫర్స్ దక్కించుకుని లక్కీ హీరోయిన్ అయిపోయింది. ఈక్రమంలో ఆదిపురుష్‌లో సీతగా బంపర్ ఆఫర్ కొట్టేసింది. మిమితో జాతీయ అవార్డు అందుకన్నా..ఈ ఫ్లాపుల నుంచి బైటపడేసే మూవీ ఏదో రావాలి. ఈ అమ్మడు నటించిన మూడు సినిమాలు 2024లో విడుదలకానున్నాయి. వాటిలో ఏదైనా సూపర్ సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.