Varun tej : సిజి వర్క్ కి ఎంత ఖర్చు చేసారో తెలిస్తే షాకవ్వాల్సిందే…

మెగా ఫ్యాన్స్ (Mega Fans) ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ ఆపరేషన్ వాలెంటైన్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. ఈ సినిమాలో వరుణ్ వింగ్ కమాండర్ రుద్రగా కనిపించనున్నాడు. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిన ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు.

మెగా ఫ్యాన్స్ (Mega Fans) ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ ఆపరేషన్ వాలెంటైన్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. ఈ సినిమాలో వరుణ్ వింగ్ కమాండర్ రుద్రగా కనిపించనున్నాడు. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిన ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు.. గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిన ఈ మూవీలో మానుషీ చిల్లార్ హీరోయిన్ గా నటించింది.. కాగా.. ఈ మూవీ సిజి వర్క్ కి సంబంధించి బయటకు వచ్చిన ఒక న్యూస్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది..

ఏరియల్ యాక్షన్ ఎంటర్టైనర్ (Entertainer Met) గా రూపొందిన ఈ మూవీలో థ్రిల్లింగ్ యాక్షన్ అంశాలు విపరీతంగా ఆకట్టుకుంటాయంటున్నారు. ఈ మూవీ సిజి వర్క్ కోసం మొత్తంగా 5 కోట్ల మేర ఖర్చు చేసారట మేకర్స్.. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ మూవీ లోని సాంగ్స్ తో పాటు టీజర్, ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకుని మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ఆపరేషన్ వాలెంటైన్ సినిమాను వాస్తవ సంఘటనల ఆధారంగా దేశభక్తి చిత్రంగా రూపొందించారు. రియల్ లైఫ్ లో యదార్థ సంఘటనలను చాలా వాస్తవికంగా చూపించడానికి మేకర్స్ ప్రయత్నించారు. షూటింగ్ కంటే ముందే భారత వైమానిక దళాలకు సంబంధించిన ఎంతో రీసెర్చ్ చేశారు. అంతే కాకుండా బెస్ట్ అవుట్ ఫుట్ ను అందించేందుకు ముందుగానే బడ్జెట్ ప్లాన్ వేసుకున్నారు. అందువల్ల సినిమాను జెట్ స్పీడ్ లోనే ఫినిష్ చేశారు. ఈ సినిమా కోసం దాదాపు 40 కోట్ల రేంజ్ బడ్జెట్ లోనే ఖర్చు పెట్టినట్లు టాక్.

40 కోట్ల బడ్జెట్‌లోనే మూవీని కంప్లీట్ చేసినప్పటికీ.. అంతకంటే ఎక్కువ స్థాయిలో ఖర్చు చేసిన చిత్రంగా ట్రైలర్ విజువల్స్ హైలెట్ అయ్యాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. ఇక సినిమాలో థ్రిల్లింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు ప్రభావాన్ని చూపుతుందని చెబుతోంది మూవీ టీమ్.. పుల్వామా సంఘటనకు సంబంధించిన విజువల్స్ ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు హృదయాలను బరువెక్కేలా చేస్తాయట. ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్, ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ అంతకుమించి ఉంటాయని తెలుస్తోంది. మరి రిలీజ్ అనంతరం ఆపరేషన్ వాలెంటైన్ ఏస్థాయి హిట్‌ను అందుకుంటుందో.. మెగా ప్రిన్స్‌కు ఎలాంటి సక్సెస్‌ను ఇస్తుందో చూడాల్సిందే..