Nani: యంగ్ హీరోలందరూ నేచురల్ స్టార్ నానిని టార్గెట్ చేశారు. నాని ఎక్కడ డిసెంబర్ 8న వచ్చేస్తాడోనని.. ముందే వాళ్ల సినిమాల రిలీజ్ డేట్‌ను ప్రకటించేశారు. కానీ నాని హాయ్ నాన్న రిలీజ్ డేట్ మాత్రం ఇంతవరకు ఎనౌన్స్ చేయలేదు. యంగ్ హీరోలకు నాని బెదిపోతాడా..? లేదంటే.. ఢీ అంటే ఢీ అంటాడా..? అన్నది చూడాలి. సలార్ రిలీజ్ డేట్ ఎనౌన్స్‌మెంట్ యంగ్ హీరోల సినిమాలను ఇబ్బంది పెట్టింది. డిసెంబర్ 22న సలార్ వస్తుంటే.. క్రిస్మస్‌కు రావాల్సిన నాని హాయ్ నాన్న.. వెంకటేశ్ సైంధవ్.. నితిన్ ఎక్స్‌స్ట్రా వాయిదా పడ్డాయ్.
సైంధవ్ సంక్రాంతికి వెళ్లిపోగా.. ఎక్స్‌స్ట్రా.. హాయ్ నాన్న డిసెంబర్ 8పై కన్నేశాయి. ఎక్స్‌స్ట్రా డిసెంబర్ 8న వస్తోందంటూ ప్రకటించినా.. హాయ్ నాన్న కొత్త రిలీజ్ డేట్‌కు ఇంకా టైమ్ ఉంది. క్రిస్మస్‌కు రావాల్సిన హాయ్ నాన్న, ఎక్స్‌స్ట్రా డిసెంబర్ 8కే రావాలనుకోవడంతో.. ఆ రోజు గట్టి పోటీ ఏర్పడింది. ఆల్రెడీ ఇదే రోజున వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వేలెంటేన్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ సోనీ పిక్చర్స్ థియేటర్స్‌ను బ్లాక్ చేసుకున్నాయి. 8నే వస్తానన్న విశ్వక్‌సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ కన్ఫార్మ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. హాయ్ నాన్న వస్తున్నాడని తెలిసి.. డిసెంబర్ 8నే రిలీజ్ డేట్ అంటూ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. ఆపరేషన్ వేలెంటేన్.. ఎక్స్‌స్ట్రా పోస్టర్స్‌ను విడుదల చేసి నో పోస్ట్‌పోన్ అంటూ కన్ఫార్మ్ చేశారు.
సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ హీరోగా నటించిన బబుల్‌గమ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన నాని హాయ్ నాన్న రిలీజ్ డేట్‌ను ఒకట్రెండు రోజుల్లో ఎనౌన్స్ చేస్తామన్నాడు. ఈ సినిమా కూడా అదే రోజు వస్తే.. నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ మధ్య గట్టి పోటీనే వుంటుంది. విశ్వక్‌సేన్.. వరుణ్‌తేజ్.. నితిన్ సినిమాలు వస్తున్న డిసెంబర్ 8న హాయ్ నాన్న రాకపోవచ్చు. అయితే.. ఒక రోజు ముందుగా 7నే రిలీజ్ చేయాలన్న ప్లాన్‌లో మేకర్స్ వున్నారట. ఒక రోజు ముందుగా వస్తే.. మంచి ఓపెనింగ్స్ వస్తాయన్న నమ్మకంతో వున్నారు. క్రిస్మస్‌నాడు సలార్.. డంకీ మధ్య కాంపిటీషన్ కంటే.. మొదటివారంలో పోటీ హెవీగా వుంది.