యంగ్ రెబల్ స్టార్ (Rebel Star) ప్రభాస్ సలార్ మూవీతో ప్రభంజనం సృష్టించాడు. దేశం యావత్తు ఇంకా సలార్ మేనియా నుంచి తేరుకోలేదు.. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రభాస్ కటౌట్‌కు తగ్గ సినిమా పడితే ఏ రేంజ్‌లో బ్లాస్ట్ అవుతుందో ప్రశాంత్ నీల్ (Prashanth Neil) నిరూపించాడు.. ప్రభాస్ మాస్ కటౌట్ కి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా టోటల్ గా 178.7 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. సలార్ సీజ్ ఫైర్ వరల్డ్ వైడ్ దాదాపు 800 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి డార్లింగ్‌కి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ఈ మూవీ మొత్తం ప్రభాస్ కటౌట్ మీదనే నడిచింది. అయితే.. ఇప్పుడు సలార్ ఓటీటీ(OTT)లోకి వచ్చేయడంతో ప్రభాస్‌కు ఎంత సేపు డైలాగ్స్ ఉన్న విషయంపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రభాస్ డైనోసార్ పెర్మాఫెన్స్‌తో బాక్సాఫీసు రికార్డులను కొల్లగొట్టిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోనూ పంజా విసురుతోంది.. నెట్ ఫ్లిక్స్ లో సలార్ సినిమా స్ట్రీమ్ అవుతోంది, దీంతో థియేటర్స్ లో మిస్ అయిన వాళ్లు… ఆల్రెడీ చూసిన వాళ్లు సైతం సలార్‌పై దండయాత్ర చేసేస్తున్నారు. కాటేరమ్మ కొడుకు వచ్చాడు అంటూ సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ వీడియోస్ తో హల్చల్ చేస్తున్నారు. కాగా.. ఈ మూవీలో ప్రభాస్‌కు డైలాగ్స్ తక్కువ ఉన్నాయన్న టాక్ వినిపించింది.
సలార్ సినిమాని థియేటర్స్ లో చూసినప్పటి నుంచి ప్రభాస్ అభిమానుల్లో, మూవీ లవర్స్ లో ఉన్న ఏకైక డౌట్… అసలు ప్రభాస్ సినిమాలో ఎంత సేపు మాట్లాడాడు? అని.. ఇప్పుడు సలార్ ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి ప్రభాస్ డైలాగ్స్ లో విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. సలార్ సినిమాలో ప్రభాస్ మొత్తం కలిపి మూడు నిముషాలు మాత్రమే డైలాగ్స్ చెప్పాడు. రెండు గంటల యాభై అయిదు నిమిషాల నిడివి ఉన్న సినిమాలో డార్లింగ్ కేవలం మూడు నిముషాలు మాత్రమే మాట్లాడాడు. యావరేజ్ గా ప్రతి రెండున్నర నిమిషాలకి ప్రభాస్ ఒక డైలాగ్ చెప్పాడన్నమాట. దీంతో.. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలోవైరల్‌గా మారింది. కేవలం మూడు నిముషాల డైలాగ్స్‌తో డార్లింగ్ రికార్డులు బద్దలు కొడుతున్నాడని.. ఇది కేవలం ఒక్క ప్రభాస్‌కే సాధ్యమంటూ డైహార్డ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.