Bhola Shankar: ఏ మాత్రం డిజప్పాయింట్ చేయని మెహర్.. ఫుల్‌ ఖుషీలో వైసీపీ..!

మెహర్ రమేష్‌ మారలేదు. ఎక్కడ హిట్ సినిమా తీసేస్తాడో అని టెన్షన్‌ పడిన అభిమానులను.. ఏ మాత్రం డిజప్పాయింట్‌ చేయలేదు అంటూ జోకులు వేసుకుంటున్నారు సోషల్‌ మీడియాలో. ఇదంతా ఎలా ఉన్నా.. భోళా శంకర్‌ రిజల్ట్‌తో వైసీపీ నేతలు ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నారు.

  • Written By:
  • Updated On - August 12, 2023 / 02:42 PM IST

Bhola Shankar: డిజప్పాయింట్ చేయడంలో ఏ మాత్రం డిజప్పాయింట్‌ చేయలేదు మెహర్ రమేష్‌. టీజర్ వచ్చినప్పుడు కాస్తో కూస్తో డౌట్‌ ఉండేది. ఐతే ట్రైలర్‌తో అనుమానం క్లియర్ అయింది. ఇప్పుడు సినిమా విడుదల తర్వాత ఫుల్ క్లారిటీ వచ్చింది. మెహర్ రమేష్‌ మారలేదు. ఎక్కడ హిట్ సినిమా తీసేస్తాడో అని టెన్షన్‌ పడిన అభిమానులను.. ఏ మాత్రం డిజప్పాయింట్‌ చేయలేదు అంటూ జోకులు వేసుకుంటున్నారు సోషల్‌ మీడియాలో. ఇదంతా ఎలా ఉన్నా.. భోళా శంకర్‌ రిజల్ట్‌తో వైసీపీ నేతలు ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నారు.

నిజానికి మెగా ఫ్యామిలీకి, వైసీపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బ్రో మూవీలో శాంబాబు పాత్రతో మొదలైన రచ్చ.. అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇక ఆ తర్వాత వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్‌లో చిరు చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలకు మరింత మంట పుట్టించాయి. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు. అందరూ చిరును టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఐతే భోళా శంకర్ రిజల్ట్‌ మాత్రం వైసీపీ నేతలను ఖుషీలో ముంచేస్తోంది. పని కట్టుకొని చిరంజీవిని కానీ, ఆ సినిమాని కానీ విమర్శించాల్సిన అవసరం వైసీపీ నేతలకు లేకుండా పోయింది. అందుకే వైసీపీ నేతలంతా మెహర్‌ రమేష్‌కు థ్యాంక్స్‌ చెప్తున్నారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకంటూ వాల్తేరు వీరయ్య ఫంక్షన్‌లో వైసీపీపై చిరంజీవి పంచ్‌లు వేశారు. జనాల బాగు గురించి, రాష్ట్రం అభివృద్ధి గురించి నాయకులు ఆలోచించాలని సెటైర్లు వేశారు. ఐతే ఇప్పుడు భోళా శంకర్ రిలీజ్ తర్వాత మెగా క్యాంప్ నుంచి సౌండ్ తగ్గింది. దీంతో సోషల్ మీడియాలో వైసీపీ సౌండ్ పెరిగింది.

భోళా శంకర్ అంచనాలను అందుకున్నా, వాటిని మించిపోయినా పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఫస్ట్ డే, ఫస్ట్ షోతో వ్యవహారం తేలిపోయింది. పనిగట్టుకుని చిరంజీవిని కానీ, ఆ సినిమాని కానీ వైసీపీ నాయకులు విమర్శించాల్సిన అవసరం లేదని అర్థమైంది. దీంతో వైసీపీ నేతలంతా మెహర్ రమేష్‌కి థ్యాంక్స్ చెప్తున్నారు. ఏమైనా సినిమా తేడా కొడితే రాజకీయ పార్టీ పండగ చేసుకోవడం ఏంటో.. విడ్డూరం కాకపోతే.. ఏపీలో ఇంతే..!