China Floods : చైనాలో భారీ వరదలకు 47 మంది మృతి..

భారత్ పొరుగు దేశం అయిన చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్‌లో భారీ వర్షాల కారణంగా భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 47 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న సోమ‌వారం తెల్ల‌వారుజామున 5:51 గంట‌ల స‌మ‌యంలో చోటు చేసుకుంది.

భారత్ పొరుగు దేశం అయిన చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్‌లో భారీ వర్షాల కారణంగా భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 47 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న సోమ‌వారం తెల్ల‌వారుజామున 5:51 గంట‌ల స‌మ‌యంలో చోటు చేసుకుంది. ఒక్క మెయిజౌ నగరంలో శుక్రవారం 38 మంది మరణించినట్లు పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడ్డ స్థలంలో స‌హాయ‌క చ‌ర్య‌ల్లో 200 మంది పాల్గొన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రుల‌కు తరలిస్తున్నారు. కాగా ఇదే నగరంలో ఇంతకు ముందు మరో తొమ్మిది మంది మరణించారని పేర్కొంది. భారీ వర్షాలకు నదులు ఉప్పొంగడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు అధికారులు చెప్పారు. వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతినగా పంట నష్టం భారీగా వాటిల్లిందన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

దక్షిణ చైనాలో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. భారీ వరదల కారణంగా రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో బాధితులకు ప్రభుత్వం సాయం అందించలేని పరిస్థితి ఏర్పడింది. పలుచోట్ల శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. దీంతో శిథిలాల కింద ఉన్న మృత‌దేహాల‌ను వెలికి తీస్తున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఏప్రిల్‌లోనే చైనాలో 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వరదల హెచ్చరిక జారీ చేసింది. ఆ సమయంలో కూడా చైనాలోని పలు ప్రావిన్సులు వరదల్లో మునిగిపోయాయి. ఈ వరదలు లక్షల ఇళ్లను ముంచేసింది. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి చైనాలో వరదల సీజన్ ముందుగానే ప్రారంభమైందని సమాచారం.