koalas : సోషల్ మీడియాలో కంటతడి పెట్టిస్తున్న కోలా జంతువు వీడియో

తాజాగా ఓ చిన్న జీవి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ అవ్వడంమే కాదు.. అందరితోటి కంటతడి కూడా పెట్టిస్తుంది ఆ విడియో.. కోలా ఈ జంతువు పేరు చాలా తక్కువగా వినుంటారు.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూసి ఉంటారు.

ఈ భూ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవికి.. మరణం ఒక్కటే.. ఆ మరణం నుంచి వచ్చే భాద ఒక్కటే.. చాలా వరకు మనుషులల్లో తప్ప మరే జీవులలో దుఃఖం అనేది.. మరణం వస్తే భాద అనే ఉండదు అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు.. ఈ సృష్టిలో ప్రతి జీవికి కోసం, భాద, ఆవేశం,ఆకలి, అన్ని ఉంటాయి. అవి వ్యక్తపరిచే సమయంలో వ్యక్తపరుస్తాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా..? అక్కడికే వస్తున్నా..

తాజాగా ఓ చిన్న జీవి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ అవ్వడంమే కాదు.. అందరితోటి కంటతడి కూడా పెట్టిస్తుంది ఆ విడియో.. కోలా ఈ జంతువు పేరు చాలా తక్కువగా వినుంటారు.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూసి ఉంటారు. ఎందుకంటే ఇది మన దేశంలో ఉండే జంతువు అయితే కాదు.. ఆస్ట్రేలియా సముద్రపు తీరంలో ఉండే అరుదైన.. అంతరించిపోతున్న జంతువులు. కోలా పూర్తి శాకాహార జీవులు. ఈ జంతువులను చిన్న ఎలుగుబంటి అని కూడా అంటారు. దీన్ని ప్రవర్త.. దీన్ని వాయిస్ కూడా అచ్చం ఎలుగు బంటి వలే ఉంటుంది.

 

ఇక విషయానికి వస్తే.. ఓ ప్రాంతంలో కోలా సహచర కోలాను కోల్పోయింది (చనిపోయింది) ఆ కోలా దానిని పట్టుకుని రోదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో.. సామాజిక మాధ్యమాల్లో చూసే వారి చెంత కూడా కన్నీళ్లు తెప్పిస్తోంది. దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన కోలా రెస్క్యూ గ్రూప్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఆ కోలా చనిపోయిన తన కోలాను తన ఒళ్లో పెట్టుకుని రోదిస్తోంది. దానిని తనివితీరా హత్తుకుని తన ప్రేమను.. బాధను వ్యక్తపరుస్తుంది. ఆ దృశ్యం చూసి కన్నీళ్లు పెట్టుకున్న స్థానికులు కోలా రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. వారొచ్చి కోలాను తమ రక్షణలోకి తీసుకున్నారు. కాగా ఆ వీడియో లో చనిపోయింది ఆడ కోలా అని గుర్తించారు. మగ కోలా కు ఆరోగ్య పరీక్షలు చేసిన అనంతరం దానిని అడవిలో విడిచిపెట్టారు. ఇక మరణించిన కోలా ఎందుకు చనిపోయిందని కోణంలో కోలా సంరక్షణ అధికారులు ఆరా తీస్తున్నారు.