హసీనా భారత్ లోనే?? ఇండియన్ స్టూడెంట్స్ సేఫ్…!

  • Written By:
  • Publish Date - August 6, 2024 / 01:07 PM IST

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కొంత సమయం ఇచ్చేందుకు కేంద్రం సిద్దమైనట్టు తెలుస్తోంది. పార్లమెంట్ లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ ఇదే విషయాన్ని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అఖిలపక్ష సమావేశంలో కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, జై శంకర్, జేపీ నడ్డా, నిర్మల సీతారామన్, కిరెన్ రిజిజు పాల్గొన్నారు. అఖిలపక్ష సమావేశానికి విపక్షం నుంచి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సుప్రియా సులే, రాం గోపాల్ యాదవ్, విజయసాయిరెడ్డి సహా వివిధ పార్టీల నేతలు హాజరు అయ్యారు.

బంగ్లాదేశ్ పరిణామాలను అఖిలపక్ష నేతలకు వివరించిన విదేశాంగ మంత్రి జై శంకర్… హసీనా తన కార్యాచరణ పై నిర్ణయం తీసుకునేవరకు కొంత సమయం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. దాదాపు 8,000 మంది విద్యార్థులు బంగ్లాదేశ్ నుంచి తిరిగి వచ్చారని అన్నారు. ఇప్పటికిప్పుడు భారతీయులను బంగ్లాదేశ్ నుంచి తరలించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో చర్చలు జరిపి బంగ్లా హిందువులపై జరిగిన దాడుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వం సరైన సమయంలో తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. కొత్త ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని మంత్రి పేర్కొన్నారు.