భారత మాజీ క్రికెటర్ (Former Indian Cricketer) అన్షుమాన్ గైక్వాడ్ (Anshuman Gaikwad) కన్నుమూశారు. ఆయన వయసు 71 ఏళ్లు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న గైక్వాడ్ (Gaikwad) గత కొంత కాలంగా లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 1983 ప్రపంచ కప్ గెలిచిన జట్టు భారత్ క్రికెట్ (Indian Cricketer) టీమ్ సభ్యులు ఆయన చికిత్స కోసం తమ సహాయాన్ని అందించారు. తర్వాత బీసీసీఐ (BCCI) కి కూడా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ గైక్వాడ్ కు సాయం చేయాలని కోరారు. దీంతో ఆయన చికిత్స కోసం బీసీసీఐ కోటి విరాళం అందించింది. గైక్వాడ్ భారత్ తరఫున 40 టెస్ట్ మ్యాచ్‌లు, 15 వన్డేలు ఆడారు. 2000 ICC ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టుకు కోచ్‌గా కూడా అన్షుమన్ గైక్వాడ్ పనిచేశారు.
గైక్వాడ్ మృతి పట్ల ప్రధాని మోదీ, బీసీసీఐ సెక్రటరీ (BCCI Secretary) జై షా (Jaisha), పలువురు మాజీ క్రికెటర్లు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భారత క్రికెట్‌కు గైక్వాడ్ చేసిన సేవలు కొనియాడదగినవనీ గుర్తు చేసుకున్నారు. ఆయన కోచింగ్ ఇచ్చిన విధానం క్రికెట్ సమాజంలో చాలా మందికి స్ఫూర్తినిస్తుందనీ ప్రశంసించారు. క్రికెట్ పట్ల అన్షుమన్ గైక్వాడ్ అంకితభావం అసమానమైనదని మాజీ సహచరులు చెప్పారు. ఆటపై ఆయన అభిరుచి, కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో గైక్వాడ్ నిబద్ధత నిజంగా ప్రశంసనీయమని కొనియాడారు.