BELL Helicopter Crashes : నాడు వైఎస్సార్… నేడు ఇరాన్ అధ్యక్షుడు…. పొట్టనబెట్టుకున్న ఆ హెలికాప్టర్

రాన్ అధ్యక్షుడు అయతుల్లా సయ్యద్ ఇబ్రహీం రైసీ అల్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అజర్ బైజాన్ సరిహద్దుల్లో జోల్ఫా దగ్గర హెలికాప్టర్ కుప్పకూలింది. అధ్యక్షుడితో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి, గవర్నర్, సెక్యూరిటీ సిబ్బంది చనిపోయారు. వాళ్ళు ప్రయాణిస్తున్న బెల్ 212 రకానికి చెందిన హెలికాప్టర్ క్రాష్ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదం... సరిగ్గా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ యాక్సిడెంట్ లాగే జరిగింది.

  • Written By:
  • Updated On - May 20, 2024 / 01:34 PM IST

ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా సయ్యద్ ఇబ్రహీం రైసీ అల్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అజర్ బైజాన్ సరిహద్దుల్లో జోల్ఫా దగ్గర హెలికాప్టర్ కుప్పకూలింది. అధ్యక్షుడితో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి, గవర్నర్, సెక్యూరిటీ సిబ్బంది చనిపోయారు. వాళ్ళు ప్రయాణిస్తున్న బెల్ 212 రకానికి చెందిన హెలికాప్టర్ క్రాష్ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అజార్ బైజాన్ కంట్రీలో ఓ డ్యామ్ ప్రారంభోత్సవంలో పాల్గొని టెహ్రాన్ తిరిగి బయల్దేరారు. ఈస్ట్ అజార్ బైజాన్ ప్రావిన్స్ లోని వర్జా ఖాన్ – జోల్ఫా మధ్య ఉన్న దట్టమైన డిజ్మర్ అడవుల గుండా వస్తుండగా హెలికాప్టర్ కుప్పకూలింది. దట్టమైన పొగమంచు ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. వాతావరణం బాగో లేకపోవడంతో పైలట్ ల్యాండింగ్ కి ప్రయత్నించడంతో హెలికాప్టర్ క్రాష్ అయింది. ప్రమాద స్థలానికి బలగాలు చేరుకోడానికి 20 గంటలు టైమ్ పట్టింది. దట్టమైన మంచుతో పాటు అటవీ ప్రాంతంలో జరగడంతో ఆ ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది.

ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదం… సరిగ్గా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ యాక్సిడెంట్ లాగే జరిగింది. వైఎస్సార్ కూడా బెల్ 430 హెలికాప్టర్ లోనే ఆరోజు ప్రయాణించారు. జీఎంసీ బాలయోగి కూడా బెల్ 206 హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. బెల్ హెలికాప్టర్లను అమెరికాకు చెందిన బెల్ టెక్స్ ట్రాప్ కంపెనీ తయారు చేస్తుంది. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన బెల్ 212 లో 15 మంది దాకా ప్రయాణించే అవకాశం ఉంది. రెండు బ్లేడ్స్ తో ఉండే ఈ హెలికాప్టర్ ను బెల్ 205కు కొనసాగింపుగా 1960లో ప్రవేశపెట్టారు. బెల్ హెలికాప్టర్లు అమెరికా, కెనడాలో కూలిన సంఘటనలు కూడా ఉన్నాయి. రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ 1979లో కొన్నారు. అమెరికా ఆంక్షలతో ఆ తర్వాత ఇరాన్ కు హెలికాప్టర్ అమ్మకాలు నిలిచిపోయాయి. రైసీని హత్య చేశారని అమెరికా అనుమానాలు వ్యక్తం చేసింది. ఆయన హయాంలో మానవ హక్కులు, మహిళల స్వేచ్ఛను అణిచివేశారు. దాంతో రైసీ మరణంతో ఇరాన్ లో క్రాకర్స్ కాల్చారు కొందరు మానవ హక్కుల కార్యకర్తలు.