టీ ట్వంటీ (T20) వరల్డ్ కప్ (World Cup) లో భారత్ జోరు కొనసాగతోంది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ (Pakistan) పై భారత్ (India) ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మందకొడి పిచ్‌పై బ్యాటర్లు తడబడినా బౌలర్లు గొప్పగా రాణించి టీమిండియాను గెలిపించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (Rishabh Pant) 42 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. పంత్ రాణించడంతో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. కానీ చివరి తొమ్మిది ఓవర్లలో 38 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా , హారిస్ రవూఫ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
ఛేదనలో తమ ఇన్నింగ్స్ ను పాకిస్థాన్ దూకుడుగా ఆరంభించింది. బుమ్రా బంతి అందుకోవడంతో పాకిస్థాన్ స్కోరు వేగం నెమ్మదించింది.దీంతో 10 ఓవర్లకు 57 రన్స్ తి చేతిలో తొమ్మిది వికెట్లు ఉండటంతో పాకిస్థాన్ ఫేవరేట్‌గానే నిలిచింది. కానీ డ్రింక్స్ బ్రేక్ తర్వాత అక్షర్ తొలి బంతికే ఉస్మాన్‌ను ఔట్ చేశాడు.
ఇక్కడ నుంచి భారత బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. హార్దిక్, బుమ్రా చెలరేగడంతో పాక్ క్రమంగా వికెట్లు కోల్పోయింది. చివరి రెండు ఓవర్లలో పాక్ విజయానికి 21 పరుగులు అవసరమవ్వగా బుమ్రా కేవలం మూడు పరుగులే ఇచ్చి ఇఫ్తికర్ ను ఔట్ చేశాడు. చివరి ఓవర్లో అర్ష దీప్ ఒక వికెట్ తీసి విజయాన్ని ఖాయం చేశాడు.