Dawood Assets auction:  దావూద్ ఇబ్రహీం ఆస్తులు వేలం …డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం !

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను వేలానికి పెడుతోంది కేంద్ర ప్రభుత్వం. మహారాష్ట్రలోని రత్నగిరి ఏరియాలో ఉన్న నాలుగు ఆస్తులు, బంగ్లా, మామిడితోను అమ్మకానికి పెట్టింది. దావూద్ నిజంగా బతికున్నాడా ? బతికి ఉంటే ఈ వేలంను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడా ?

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 07:41 PM IST

ముంబై పేలుళ్ళకు పాల్పడి పాకిస్తాన్ లో తలదాచుకున్న ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కేంద్రప్రభుత్వం షాక్ ఇవ్వబోతోంది.  మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతంలో ఉన్న ఇబ్రహీం ఆస్తులను 2024 జనవరి 5నాడు వేలం వేస్తున్నారు.  మహారాష్ట్రలోని ఖేడ్ తాలూకా రత్నగిరిలో దావూద్ ఇబ్రహీం పుట్టాడు. అక్కడో పెద్ద బంగ్లా, మామిడి తోట ఉన్నాయి. వీటితో పాటు మరో నాలుగు ఆస్తులు కూడా రత్నగిరి ఏరియాలో ఉన్నాయి.  వీటిని పదేళ్ళ క్రితమే గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు అమ్మకానికి పెట్టింది.

సౌత్ ముంబైలో ప్రైమ్ లొకేషన్ లో ఉన్న గెస్ట్ హౌస్, ఓ హోటల్, పెట్రోల్ పంపు, ఆరు అపార్ట్ మెంట్లను 2017 నవంబర్ లో బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్లతో కూలగొట్టింది.  ఆ తర్వాత ఆ స్థలాలను అమ్మింది. దావూద్ ఇవన్నీ ఉగ్రవాద కార్యకలాపాలు చేసి… అక్రమ సంపాదనతో వీటిని కొన్నాడు. ఈ ఆస్తులను తన పేరుతో పాటు కుటుంబసభ్యులు, బంధువుల పేర్లతో రిజిస్టర్ చేయించాడు. రత్నగిరిలో మామిడి తోటలు, భవనాల అమ్మకానికి వేలం నిర్వహిస్తోంది ప్రభుత్వం.

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నిజంగా బతికి ఉన్నాడా లేదా అన్నది ఈ వేలంగా సందర్భంగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం, ISS సంరక్షణలో కరాచీలో ఉన్న దావూద్ పై పది రోజుల క్రితం విష ప్రయోగం జరిగిందనీ, హాస్పిటల్ పాలైనట్టు వార్తలు వచ్చాయి.  ఆయన చనిపోయాడని కొందరు… అసలు విష ప్రయోగమే జరగలేదని మరికొందరు వాదించారు.  మరి రత్నగిరిలో ఆస్తుల వేలంను దావూద్ అడ్డుకుంటాడా…. అసలు అతని ఆస్తులు కొనడానికి వేలంలో ఎవరైనా పాల్గొంటారా… వాటిని కొనే ధైర్యం చేస్తారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.