Deepfake Videos : ఇక నుంచి డీప్‌ఫేక్‌ వీడియోలు చేస్తే జైలుకే.. షేర్‌ చేసినా నేరమే..

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ సహాయంతో చేస్తున్న డీప్‌ఫేక్‌ వీడియోలు ఇప్పుడు సమాజానికి కొత్త సమస్యగా మారాయి. సెలబ్రెటీల మొహాలను పోర్న్‌ స్టార్స్‌కు మార్ఫింగ్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు కొందరు నీచులు. కేవలం సెలబ్రిటీలే కాదు.. కామన్‌ పీపుల్‌ కూడా ఈ డీప్‌ ఫేక్‌ కు బలవుతున్నారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ సహాయంతో చేస్తున్న డీప్‌ఫేక్‌ వీడియోలు ఇప్పుడు సమాజానికి కొత్త సమస్యగా మారాయి. సెలబ్రెటీల మొహాలను పోర్న్‌ స్టార్స్‌కు మార్ఫింగ్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు కొందరు నీచులు. కేవలం సెలబ్రిటీలే కాదు.. కామన్‌ పీపుల్‌ కూడా ఈ డీప్‌ ఫేక్‌ కు బలవుతున్నారు. దీంతో ఈ డేంజర్‌ను కంట్రోల్‌ చేసేందుకు కేంద్ర ఐటీ శాఖ సిద్ధమైంది. త్వరలోనే దీనిపై కఠినమైన రెగ్యులేషన్స్‌ తీసుకువస్తామన్నారు సెంట్రల్‌ ఐటీ మినిస్టర్‌ అశ్వినీ వైష్ణవ్‌. డీప్‌ఫేక్‌ వీడియోలు తయారు చేస్తే.. జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా ఉంటుందని చెప్పారు. ఇలాంటి వీడియోలు తయారు చేస్తున్న వ్యక్తులు, వాటిని సర్క్యూలేట్‌ చేస్తున్న సోషల్‌ మీడియా సైట్లపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదే విషయంలో ఇప్పటికే పలు సోషల్‌ మీడియా సైట్ల మేనేజ్‌మెంట్‌తో మీటింగ్‌ కూడా నిర్వహించామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్న ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోలకు సోషల్‌ మీడియా సైట్లు వేదికలుగా మారుతున్నాయంటూ చెప్పారు అశ్వినీ వైష్ణవ్‌.

Priyanka : యశస్విని కోసం రంగంలోకి దిగిన ప్రియాంక.. ఎర్రబెల్లి కేడర్లో వణుకు..

డీప్‌ఫేన్‌ను నియంత్రించేందుకు పది రోజుల్లో ఓ స్పెషల్‌ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. డీప్‌ఫేక్‌ వీడియోలను గుర్తించడం.. వెంటనే వాటి గురించి రిపోర్ట్‌ చేయడం.. ఇలాంటి వీడియోల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం లాంటి పనులను ఈ స్పెషల్‌ కమిటీ పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఏదైనా వీడియో ఫేక్‌ అనిపిస్తే వెంటనే దానిపై ఫేక్‌ లేబులింగ్‌ వేయాలంటూ సోషల్‌ మీడియా సైట్లకు ఆదేశారు జారీ చేశారు. ఈ వీడియోలు ఫారెన్‌లో ఎడిట్‌ చేసి ఇండియాలో సర్క్యూలేట్‌ చేసినా.. ఇక్కడి రూల్స్‌ ప్రకారమే శిక్ష ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. డీప్‌ఫేక్‌ వీడియోలను వెంటనే గుర్తించే టెక్నాలజీని తయారు చేసేందుకు కూడా పనులు ప్రారంభించామని చెప్పారు. కొన్ని సంస్థలకు ఈ పనులు ఇప్పటికే అప్పగించినట్టు చెప్పారు. కొత్తగా తీసుకువస్తున్న రూల్స్‌పై ప్రజా అభిప్రాయం కూడా సేకరిస్తామన్నారు. ఇలాంటి వీడియోలను నిలువరించేందుకు కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగానే చర్చలు సాగుతున్నాయంటూ చెప్పారు. ఇక నుంచి డీప్‌ఫేక్‌ వీడియోలు క్రియేట్‌ చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేలా కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్‌ ఇచ్చారు.