ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో లాభాలు ఎన్నిఉన్నాయో… నష్టాలు కూడా అన్నే ఉన్నాయనిపిస్తోంది. గత నాలుగైదేళ్ళుగా సాఫ్ట్ వేర్ లో కొలువులు రాక ఫ్రెషర్స్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వకపోగా… ఉన్నోళ్ళను పీకేస్తున్నాయి. AI వచ్చాక ఉద్యోగాలు మరింత ప్రమాదంలో పడ్డాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉద్యోగాలు పోతాయని ఎలాన్ మస్క్ లాంటి టెక్ దిగ్గజాలు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. అదే నిజం కాబోతోంది. ప్రముఖ సెర్చింజన్ గూగుల్ 40 వేల మందిపైకి పైగా వేటు వేయడానికి సిద్ధమవుతోంది. వీళ్ళ స్థానంలో ఏఐ టెక్నాలజీని వాడుకోవాలని అనుకుంటోంది.
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హవా నడుస్తోంది. మొబైల్స్ దగ్గర నుంచి ప్రతి టెక్నాలజీలోనూ దీని వాడకం పెరిగిపోయింది. గూగుల్ కూడా AI ని వాడుకోవాలని డిసైడ్ అయింది. దాంతో దాదాపు 30 వేల మంది దాకా కొలువులు కోల్పోయే అవకాశాలున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటైన గూగుల్ కి ప్రపంచవ్యాప్తంగా 70 ఆఫీసులు ఉండగా… వాటిల్లో 2 లక్షల మంది దాకా ఉద్యోగులు పనిచేస్తున్నారు. గూగుల్ ని నమ్ముకొని ఎన్నో యేళ్ళుగా పనిచేస్తున్న ఉద్యోగులకు షాక్ ఇవ్వబోతోంది. తన యాడ్స్ సేల్స్ యూనిట్ విభాగంలో ఏఐ ఆధారిత ఆటోమేటిక్ డిజైన్ టూల్ ను వాడాలని నిర్ణయించింది. దాంతో మనుషులతో పని లేకుండా ఏఐ టూల్స్ తోనే యాడ్స్ డిజైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. AI వాడకంతో టైమ్ తో పాటు డబ్బు కూడా సేవ్ అవుతాయి. అందుకే గూగుల్ ఈ కొత్త ఆలోచన చేసింది.
యాడ్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటం వల్ల మరిన్ని లాభాలు సంపాదించవచ్చని గూగుల్ భావిస్తోంది. అందుకే యాడ్స్ విభాగంలో ఉద్యోగులకు బదులు AIని వాడబోతున్నట్టు గత వారంలో జరిగిన మీటింగ్ లో అనౌన్స్ చేసింది. AI ఆధారిత ప్రటనలతో కొత్త శకాన్ని ప్రారంభిస్తున్నట్టు గర్వంగా ప్రకటించారు గూగుల్ ప్రతినిధులు. దీంతో ప్రకటనదారులు.. తమ యాడ్స్ ని… యూట్యూబ్, సెర్చ్, డిస్కవర్, జీమెయిల్, మ్యాప్స్ ఇలా ఎందులో పెట్టాలన్నది డిసైడ్ చేసుకోవచ్చు. దీంతో భారీ స్థాయిలో ప్రకటనలు పెరుగుతారని గూగుల్ చెబుతోంది. అయితే AI వాడకంతో… ప్రస్తుతం సేల్స్ వర్క్ లో ఉన్న 13 వేల 500 మందితో పాటు… యాడ్స్ డివిజన్ లో పనిచేసే 30 వేల మందికి పనిలేకుండా పోతుంది. అయితే వాళ్ళందరినీ తొలగించబోమనీ……వాళ్ళకి గూగుల్ లోనే వేరే విభాగాల్లో పని కల్పిస్తామని చెబుతున్నారు. వచ్చే నెలలో AI వినియోగం ప్రారంభించిన తర్వాత గానీ గూగుల్ నిజంగా ఎంతమందిని తొలగిస్తుంది అన్నది అర్థమవుతుంది.