హసీనాను బ్రిటన్ వద్దంటుందా…? ఇప్పుడు ఆమె ఎక్కడ…?

  • Written By:
  • Publish Date - August 6, 2024 / 09:16 AM IST

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేసిన అనంతరం సోమవారం సాయంత్రం ఆమె భారత్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఆమె లండన్ వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నా అక్కడి ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రావడం లేదు. ఒకవేళ బ్రిటన్ అంగీకరించకపోతే భారత్ లోనే ఆశ్రయం పొందాలని ఆమె భావిస్తోంది. అయితే కేంద్రం ఆమెను భారత్ లో ఉండేందుకు తాత్కాలికంగానే అనుమతించింది. ప్రస్తుతం ఆమె ఢిల్లీకి సమీపంలో ఒక ఎయిర్ బేస్ లో ఆశ్రయం పొందుతున్నారు.

ఆమె కుమార్తె తులిప్ సిద్ధిక్, లేబర్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ బ్రిటీష్ పార్లమెంటు సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఢాకాలో చోటు చేసుకున్న పరిణామాలను న్యూఢిల్లీ నిశితంగా పరిశీలిస్తోందని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఢాకాలో, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ మాట్లాడుతూ, హసీనా రాజీనామా చేశారని, తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలను స్వీకరిస్తోందని అన్నారు.

తాను దేశ ప్రధానిగా బాధ్యతలు తీసుకుంటున్నా అని అందరూ తనకు సహకరించాలని ఆయన కోరారు. తాను రాజకీయ నాయకులను కలిశానని, శాంతిభద్రతల బాధ్యతను ఆర్మీ తీసుకుంటుందని చెప్పానని ఆర్మీ చీఫ్ వెల్లడించారు. గత రెండు రోజులుగా హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో 100 మందికి పైగా చనిపోయారు.