Pakistan Polls: పాకిస్తాన్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంట్‌కు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఒక జనరల్ స్థానం నుంచి హిందూ మహిళ పోటీ చేయబోతుంది. ఆమె పేరు సవీరా ప్రకాశ్. ఖైబర్ పఖ్తుంక్వాలోని బునెర్ జిల్లాలోని పీకే-25 నుంచి సవీరా ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఆమె తండ్రి ఓం ప్రకాష్ కూడా రాజకీయ నాయకుడే. ఆయన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత. గతంలో వైద్యుడిగా పని చేసి రిటైర్ అయ్యారు.
BIG BOSS CASE : బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు ఇకపై ర్యాలీలు నిషేధించే ఛాన్స్ !
35 ఏళ్లుగా పీపీపీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. సవీరా విద్యావంతురాలు. ఆమె 2022లో స్థానిక ఆబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. తన తండ్రి రాజకయ వారసత్వాన్ని, వైద్య వృత్తిని అనుసరిస్తున్నట్లు సవీరా తెలిపారు. సవీరా పీపీపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. గత వారమే ఆమె నామినేషన్ దాఖలు చేశారు. పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఇటీవల కొన్ని సవరణలు చేసింది. దీని ప్రకారం.. జనరల్ స్థానాల్లో 5 శాతం మహిళా అభ్యర్థులకు కేటాయించాలని నిర్ణయించింది. పాక్‌లో నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 30 వరకు సాగుతుంది. నామినేషన్ పత్రాలపై అభ్యంతరాలను జనవరి 3 వరకు దాఖలు చేయొచ్చు.
వీటిపై జనవరి 10 లోపు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది. జనవరి 11న అభ్యర్థుల జాబితా విడుదలైతే, 12 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. సాధారణంగా పాక్‌లో హిందువులకు ఇతర అవకాశాలు తక్కువ. ఎన్నికల్లో పోటీ చేయడం చాలా అరుదు. కానీ, సవిరా పోటీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.