Russia Moscow : రష్యాలో ఉగ్ర దాడిని ఖండించిన భారత్.. రష్యాకు అండగా ఉంటామన్న ప్రధాని మోదీ..

రష్యా (Russia) రాజధాని మాస్కోలో (Moscow) నిన్న శుక్రవారం జరిగిన భారీ ఉగ్రదాడి (Terrorist Attack)లో ఈ దాడిలో 60 మందికి పైగా చనిపోగా, మరో 145 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ 'ఎక్స్' (ట్విటర్) వేదికగా స్పందించారు. ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.

రష్యా (Russia) రాజధాని మాస్కోలో (Moscow) నిన్న శుక్రవారం జరిగిన భారీ ఉగ్రదాడి (Terrorist Attack)లో ఈ దాడిలో 60 మందికి పైగా చనిపోగా, మరో 145 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా స్పందించారు. ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఇది హేమమైన చర్య అని ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు తాను సంతాపం తెలుపుతున్నాట్లు తెలియజేశారు. రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు సంఘీభావం తెలియజేశారు. ‘మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మా ఆలోచనలు, ప్రార్థనలు వారితోనే ఉంటాయి. ఈ విపత్కర సమయంలో రష్యా ప్రభుత్వానికి, రష్యన్ ఫెడరేషన్ ప్రజలకు అండగా ఉంటాం. ‘ అని మోడీ ట్వీట్ చేశారు.

ఈ దాడిని అమెరికాతో (America) పాటు ఐక్యరాజ్య సమితి (United Nations) సభ్యదేశాలన్నీ ఖండించాయి. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరో వైపు ఈ దాడి తామే చేసినట్లు ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకున్నది. కాగా గత రెండు దశాబ్దాల్లో రష‌యాల్లో ఇదే అతి పెద్ద ఉగ్రదాడి.

 

 

SURESH. SSM